Pension Beneficiaries Palabhishekam to Chandrababu Portrait: పింఛన్ల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికల హామీని తొలి నెలలోనే అమలు చేయడంతోపాటు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి ఇవ్వడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు పలుచోట్ల క్షీరాభిషేకాలు చేశారు.
గుంటూరులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వినగడప తండాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాలాభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలతో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు. మంగళగిరిలో పింఛన్ సొమ్ముతో పాటు నూతన వస్త్రాలు అందజేశారు. దుగ్గిరాలలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రాష్ట్రంలో పింఛన్ల పండగ- లబ్ధిదారుకు స్వయంగా పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు
చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమ పాలాభిషేకం చేయగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వృద్ధుల కాళ్లు కడిగి సత్కరించారు. పెనుగంచిప్రోలులో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకేసారి 7 వేల రూపాయలు పెన్షన్ అందుకోవడంతో గుంటూరు జిల్లాలో లబ్ధిదారుడి ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో ఓ వ్యక్తి నృత్యాలు చేశాడు. ప్రజాప్రతినిధులు అందించిన పెన్షన్ డబ్బులు చేతిలో పట్టుకుని రోడ్డుపై ఉత్సాహంగా ఆడిపాడారు.
పింఛన్ల పంపీణీకి అధికారుల గైర్హాజరు- హోం మంత్రి ఆగ్రహం - చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాజమహేంద్రవరంలో పింఛన్‌దారులకు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నగదు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
నర్సీపట్నంలో పింఛన్ల పంపిణీ తర్వాత చంద్రబాబు చిత్రపటానికి చింతకాయల విజయ్ పాలాభిషేకం చేశారు. విశాఖ మధురవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గాజువాకలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. పార్వతీపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది. అరకులో పింఛన్ల పంపిణీ పండుగ వాతావారణాన్ని తలపించింది.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు- గుండె తరుక్కుపోయే ఆ ఘటన మీకు తెలుసా? - CBN Help to Parveen
అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. దేమకేతేపల్లిలో చంద్రబాబు, పవన్, మోదీ చిత్రపటాలకు ఆమె పాలాభిషేకం చేశారు. కడపలోని ఎర్రముక్కపల్లెలో వృద్ధులను సన్మానించి, చంద్రబాబు చిత్రపటాన్ని మేళతాళాలతో ఊరేగించారు. కర్నూలులో అట్టహాసంగా పింఛన్ల పంపిణీ చేపట్టారు. పాణ్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. హుసేనాపురంలో మేళతాళాలతో వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పండుగ - స్వయంగా పంపిణీ చేసిన నేతలు - pension distribution in ap