ETV Bharat / state

జగన్ అసమర్థత వల్ల రూ.450 కోట్ల అదనపు భారం : పెమ్మసాని చంద్రశేఖర్ - PEMMASANI ABOUT AMRAVATI

'2025 ఏప్రిల్‌కు పూర్తికావాల్సిన బ్రిడ్జి జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైంది'

pemmasani_chandrasekhar_about_bridge_on_krishna_river_at_amravati
pemmasani_chandrasekhar_about_bridge_on_krishna_river_at_amravati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Pemmasani Chandrasekhar About Bridge On Krishna River At Amravati : అమరావతిలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి మరో ఏడాదిన్నరలోగా అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2025 ఏప్రిల్‌కు పూర్తికావాల్సిన బ్రిడ్జి జగన్ చేతకానితనం వల్లే ఆలస్యమైందని ఫలితంగా ప్రభుత్వంపై రూ.450 కోట్ల అదనపు భారం పడిందని మండిపడ్డారు. బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 18 కిలోమీటర్లు నిర్మించే రహదారిని ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని మంత్రి చెప్పారు.

'ఈ బ్రిడ్జ్​ ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం పూర్తయ్యింది. ప్రతీ రెండు కిలోమీటర్లకు అండర్​పాస్​లు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రతీ కిలోమీటర్​కు ఈ అండర్​ పాస్​లు నిర్మించాల్సి వస్తుంది. జగన్​రెడ్డి ఐదేళ్ల పాలన వల్ల మనం చాలా నష్టపోవాల్సివస్తుంది. అయినప్పటికీ అన్ని సవాళ్లను ఎదుర్కుని త్వరలోనే ఈ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకువస్తాం.' -పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి

రుషికొండలో తేలియాడే వంతెన-సాధ్యాసాధ్యాల పరిశీలన

శ్రీశైలం సిగలో మరో ఐకానిక్‌ వంతెన - పర్యాటకుల మనసు దోచేలే ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.