ETV Bharat / state

రెచ్చిపోయిన పెద్దపంజాణి ఎస్ఐ - టీడీపీ కార్యకర్తపై దాడి

Peddapanjani SI Attacked on TDP Activist: చిత్తూరు జిల్లా వి.కోట వీరాంజనేయస్వామి పుష్పపల్లకీ జాతరలో పెద్దపంజాణి ఎస్ఐ శ్రీనివాసులు రెచ్చిపోయారు. బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ ఫోన్​పై తెలుగుదేశం స్టిక్కర్ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్ఐ తీరును స్థానికులు తప్పుపట్టగా తాను పెద్దిరెడ్డి మనిషిని అంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ ఉదంతం అంతా ఎమ్మెల్యే కళ్ల ముందే జరిగినా, ఆయన పోలీసులను ఆపే ప్రయత్నం చేయలేదు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 3:53 PM IST

SI attacked on TDP worker
SI attacked on TDP worker
రెచ్చిపోయిన పెద్దపంజాణి ఎస్ఐ - టీడీపీ కార్యకర్తపై దాడి

Peddapanjani SI Attacked on TDP Activist: వైఎస్సార్సీపీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి, ఓ ఎస్​ఐ టీడీపీ కార్యకర్తపై తన ప్రతాపం చూపించారు. తాను మంత్రి పెద్దిరెడ్డికి దగ్గరి వ్యక్తినని అంటూ హంగామా చేశాడు. తాను చేసిన తప్పు ఏంటి అని ప్రశ్నించినందుకు తెలుగుదేశం కార్యకర్తను ఎస్​ఐ బూటు కాలితో తన్నిన ఘటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐ తీరుపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళనలతో దిగివచ్చిన పోలీస్ అధికారులు ఎస్ఐపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో చోటు చేసుకుంది.

పెద్దిరెడ్డికి దగ్గరి వ్యక్తినంటూ బూతు పురాణం: చిత్తూరు జిల్లా వి.కోటలో పెద్దపంజాణి ఎస్ఐ శ్రీనివాసులు (SI Srinivas) రెచ్చిపోయారు. ఫోన్​పై టీడీపీ స్టిక్కర్‌ వేసుకున్నాడనే కారణంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్ఐ (SI) తీరును స్థానికులు తప్పుపట్టగా, తాను పెద్దిరెడ్డికి దగ్గరి వ్యక్తి అంటూ బూతు పురాణం అందుకున్నారు. ఇదే నియోజకవర్గమైతే మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఉండేవారు కాదంటూ అక్కడ అడ్డుకోబోయే వారిని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కళ్ల ముందే ఉదంతం జరిగినా: టీడీపీ నాయకులు (TDP leaders), స్థానికులు తెలిపిన వివరాల మేరకు, వి.కోట మండలం తుపాకీ చిన్నేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చెంగప్ప, సోమవారం రాత్రి వీరాంజనేయస్వామి పుష్పపల్లకీ జాతరకు వచ్చారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు ఆయన ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్నారు. ఇతరుల వాహనాల్ని అనుమతిస్తూ తననెందుకు అడ్డుకుంటున్నారని చెంగప్ప ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఎస్​ఐ శ్రీనివాసులు బాబు జేబులో ఉన్న ఫోన్​పై టీడీపీ స్టిక్కర్‌ను గమనించారు. 'రేయ్‌ నువ్వు తెలుగుదేశం కార్యకర్తవా' అంటూ దూషిస్తూ ముఖంపై తన్నారు, అక్కడే ఉన్న ఓ విలేకరి, స్థానికులు అడ్డుచెప్పారు. వారిపైనా ఎస్ఐ చిందులు తొక్కారు. ఈ ఉదంతం అంతా ఎమ్మెల్యే కళ్ల ముందే జరిగినా, ఆయన పోలీసులను ఆపే ప్రయత్నం చేయలేదు.

వైఎస్సార్సీపీకి మరో షాక్​, మంత్రి గుమ్మనూరు రాజీనామా - "జగన్ గుడిలో విగ్రహం లాంటివారు!"

రోడ్డుపై ఆందోళన చేపట్టిన టీడీపీ కార్యకర్తలు: ఎస్ఐ దాడి చేసిన విషయం తెలుసుకున్న వి.కోట టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్‌, నాయకులు సోము, భారీ సంఖ్యలో కార్యకర్తలు పలమనేరు-క్రిష్ణగిరి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలకు స్థానిక సీఐ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి చెయ్యి దాటడంతో టీడీపీ నాయకులపై, పోలీసులు లాఠిఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న పలమనేరు డీఎస్పీ (Palamaneru DSP) ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్​ఐపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్సీ హామీతో టీడీపీ నేతలు శాంతించారు.

అక్రమార్జనకు కొత్తబాటలు వేసిన అవినీతి మాంత్రికుడు- టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్నే అడ్డుపెట్టుకుని దందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.