ETV Bharat / state

అక్కడి పసుపు కుంకుమ తెచ్చి పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయి! - PEDDAIAH GUTTA TEMPLE HISTORY

తెలంగాణ రాష్ట్రంలో పాండవుల దేవాలయం - వారంలో ఆ రెండు రోజులు అన్నదాతలతో సందడి

Peddaiah Gutta Temple History
Peddaiah Gutta Temple History (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Peddaiah Gutta Temple History : చుట్టూ దట్టమైన అరణ్యం (అడవి), ఎత్తైన గుట్టలు, కోరిన కోర్కెలు తీర్చే అల్లుబండ, పూజారులు గుట్టపై నుంచి తెచ్చే రకరకాల ధాన్యం, ఆహ్లాద వాతావరణం ఇవీ భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతున్న పెద్దయ్య - చిన్నయ్య దేవుని విశేషాలు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని అన్నదాతల గుడిగా భక్తులు పిలుచుకుంటారు. వర్షాకాలం వరి కోతలు మొదలుకొని మళ్లీ యాసంగి పనులు ఊపందుకునే వరకు రైతన్నల సందడి ఉంటుంది. తిరిగి యాసంగి పనులు పూర్తి అయి వానాకాలం ప్రారంభం అయ్యే వరకు కర్షకులతో కిటకిటలాడుతుంది.

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో పెద్దయ్య - చిన్నయ్య దేవాలయం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ కొండల్లోనే తల దాచుకున్నారని ప్రతీతి. పెద్దయ్య అంటే ధర్మరాజు అందుకే పెద్దయ్య దేవుడిగా, గుట్టను పెద్దయ్య గుట్టగా పిలుస్తారని భక్తులు చెపుతారు. భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని వివాహం చేసుకోవడంతో ఈ ప్రదేశాన్ని పెండ్లి మడుగుగా పిలుస్తారని చెబుతారు. అర్జునుని పేర అర్జుగూడ, గుట్టకు కొంత దూరంలో అర్జున లొద్ది నీటి గుండం ఉంది. సహ దేవుని పేర వెలిసిన సామగూడ ఉంది.

తిరుమల భక్తులకు అలర్ట్ - వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ ఎప్పటినుంచంటే!

కాలి నడకన ప్రయాణం : దండేపల్లి నుంచి ఊట్ల వరకు వాహనాలలో వెళ్లడానికి రహదారి ఉంది. కానీ ఆ తరువాత 2 కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణం చేయాలి. అడవిలో చుట్టూ చెట్లు, రాళ్ల మధ్యలో నుంచి నడవడం ద్వారా కొత్త అనుభూతి పొందుతారు.

పంటలు బాగా పండుతాయని రైతన్నల విశ్వాసం : ప్రతీ ఆదివారం, గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వేలాది మంది వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేస్తే చీడలు లేకుండా పంటలు బాగా పండుతాయని రైతన్నలకు విశ్వాసం ఉంది. వానాకాలం ప్రారంభంలో, విత్తనాలు విత్తేటప్పుడు, వరి కోతల సమయంలో అన్నదాతలు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తుంటారు. దేవుడు వెలిసిన ఈ గుడిని ఇల్లారి అని పిలుస్తారు.

మంచు కొండల నిలయం చిన్నయ్య దేవుడు : లక్షెట్టిపేట మండలం చల్లంపేటకు 5 కి.మీ. దూరంలో అటవీ ప్రాంతంలో చిన్నయ్య కుటీరం ఉంది. పెద్దయ్య దేవుని వద్ద నుంచి ఇక్కడకు సొరంగ మార్గం ఉండేదని భక్తులు చెప్తారు. ద్రౌపది స్నానం ఆచరించిందనడానికి గుర్తుగా కుండలు, కొలను భీముడు వ్యవసాయం చేసినట్లుగా నల్లని రాయిపై ఎద్దుల గిట్టల ముద్రలు, భీముని పాదముద్రలు ఇక్కడి విశేషాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి 2 కిలో మీటర్లు వెళ్తే మంచు కొండలు వస్తాయి. అక్కడ రాతి కొండల మధ్య నుంచి నీరు జాలు వారుతుంది. సందర్శకులు ఎంత శబ్ధం చేస్తే అంత ఎక్కువ నీరు కొండల నుంచి జాలువారుతుంది.

శ్రీ‌వారి భక్తులకు శుభవార్త - రేపటి నుంచి 'మార్చి 2025' దర్శన టికెట్ల విడుదల

పొలంలో చల్లితే ఎలాంటి రోగాలు రావు : దేవాలయం ఎదురుగా సుమారు 3 వందల మీటర్ల ఎత్తులో నిటారుగా ఉండే పెద్దయ్య గుట్టను పూజారులే ఎక్కడం ప్రధాన ఆకర్షణ. 10 నిమిషాల్లో వెళ్లి కిందికి వస్తారు. వచ్చేటప్పుడు భక్తులు ఎదురుగా నిలబడి పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు. గుట్టపై నుంచి పసుపు, కుంకుమలు, ధాన్యం తీసుకుని వస్తారు. చీడపీడల నివారణ తదితర అనేక వివరాలు తెలియజేస్తాడు. పూజారి ఇచ్చిన పసుపు కుంకుమలను పొలంలో చల్లితే ఎలాంటి రోగాలు రావని అన్నదాతల నమ్మకం.

అల్లుబండ గట్టి నమ్మకం : ఇల్లారిలో విగ్రహాల ముందు ఉన్న గద్దెపై 'అల్లుబండలు' అని పిలిచే 2 గుండ్రటి రాళ్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు అల్లుబండలను లేపి చూస్తారు. భక్తులు మనస్సులో ఒక పని అనుకుని ఆ బండలు లేపాలి. పని అయ్యేటట్లయితే ఆ బండలు లేవవు. కాదు అనిపిస్తేనే బండలు లేస్తాయనేది భక్తుల అపార నమ్మకం.

శ్రీవారి దర్శనానికి ఎన్నెన్ని దారులో - సర్వదర్శనం నుంచి స్లాటెడ్‌ బుకింగ్‌ వరకు మీకోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.