ETV Bharat / state

'గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం'- పవన్‌ ప్రతిపాదనకు కూటమి ఏకగ్రీవ ఆమోదం - Chandrababu as CM candidate - CHANDRABABU AS CM CANDIDATE

Pawan Kalyan Proposed Chandrababu as CM Candidate : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణల సమయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని జనసేనాని అన్నారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ ఆయన్ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Pawan Kalyan Proposed Chandrababu as CM Candidate
Pawan Kalyan Proposed Chandrababu as CM Candidate (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 11:11 AM IST

Updated : Jun 11, 2024, 12:40 PM IST

Pawan Kalyan Proposed Chandrababu as CM Candidate : టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్‌ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Chandrababu Elected as TDLP Leader : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్‌ మాట్లాడారు.

'గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం'- పవన్‌ ప్రతిపాదనకు కూటమి ఏకగ్రీవ ఆమోదం (ETV Bharat)

రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను - చంద్రబాబు - Chandrababu oath Ceremony As cm

శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతాం : టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచారని, 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీయే కూటమి దక్కించుకుందని గుర్తు చేశారు. ఇది అద్భుతమైన విజయమని, ఎన్డీయే కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలో చెప్పానని, అదే మాటపై నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్ : ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలని, నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం పేర్కొన్నారు. ఆయన నలిగిపోయారని, జైల్లో చూశానని, అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూశానని, మంచిరోజులు వస్తాయని, కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానని గుర్తు చేశారు. ఆ రోజులు వచ్చాయి. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నానిని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ - Janasena Party Legislature Leader

సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉంది : పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదనను పురందేశ్వరి సమర్థించారు. అనంతరం మాట్లాడుతూ, గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని, అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు యుక్తి, మోదీ స్ఫూర్తి, పవన్‌ శక్తి కలయికే కూటమి అని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - మంత్రి యోగం ఎవరెవరికో? - AP NEW CABINET MINISTERS list

Last Updated : Jun 11, 2024, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.