Pawan Kalyan Interested in Deputy CM Post: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి - Pawan Interested Deputy CM Post - PAWAN INTERESTED DEPUTY CM POST
Pawan Kalyan Interested in Deputy CM Post: రాష్ట్రంలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే విషయంపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి పవన్‌కల్యాణ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కల్యాణ్‌తో మాట్లాడారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 8:29 AM IST