ETV Bharat / state

పవర్ స్టార్ మంచి మనసు - వరద బాధితులకు పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం - PAWAN KALYAN DONATES 6 CRORES

Pawan Kalyan Donation to Flood Victims: వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగేే నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. ఇప్పటికే జూనియర్​ ఎన్టీఆర్​ తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

Pawan Kalyan
Pawan Kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 3:53 PM IST

Tollywood Actors Donation to Flood Victims : బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదైంది. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీతారలు ముందుకొచ్చి తమవంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే నటులు జూనియర్​ ఎన్టీఆర్, విశ్వక్​సేన్, సిద్ధు జొన్నలగడ్డ తమ వంతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు విరాళం ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌ 6 కోట్ల విరాళం : సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్‌ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని అన్నారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని తెలిపారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని వెల్లడించారు.

పెద్ద మనసు చాటుకున్న సినీ హీరోలు - వరద సాయం ఎవరెంత ఇచ్చారంటే! - Tollywood donates to flood victims

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ కోటి విరాళం : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ భారీ విరాళం అందించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. తన బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వాలు మద్దతు ఇద్దాం : సినీ నటుడు మహేష్ బాబు సైతం భారీ విరాళం ప్రకటింస్తున్నట్లు ట్విట్టర్ (X) వేదికగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలనకు చెరో రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. మొత్తంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సంక్షోభాన్ని మనందరం అధిగమించాలని అన్నారు.

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.