ETV Bharat / state

తిరుపతిలో వైద్యురాలిపై రోగి దాడి - రక్షణ కల్పించాలని జూడాల ధర్నా - Patient Attacked Doctor in Tirupati - PATIENT ATTACKED DOCTOR IN TIRUPATI

Junior Doctors Protest Tirupati SVIMS : తిరుపతిలోని స్విమ్స్‌ వైద్యశాలలో ఓ మానసిక రోగి ప్రవర్తన ఉద్రిక్తతకు దారితీసింది. జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి చేయడంతో వైద్యులు, జూడాలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం వైద్యుల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Doctors Protest Tirupati SVIMS
Doctors Protest Tirupati SVIMS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 8:00 AM IST

SVIMS Doctors Dharna in Tirupati : ఆసుపత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బంది రక్షణపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న వేళ తిరుపతిలోని స్విమ్స్‌లో ఓ మహిళా జూనియర్ వైద్యురాలిపై రోగి దాడికి పాల్పడటం కలకలం రేపింది. తిరుమలలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం అతణ్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ అక్కడే విధుల్లో ఉన్న వైద్యురాలు స్పందనపై అతడు జుట్టుపట్టి లాగి దాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి వైద్యులు ఆమెను కాపాడి అతని బారి నుంచి విడిపించారు.

Patient Attack on Junior Doctor in SVIMS : ఈ క్రమంలోనే జూనియర్ వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు రక్షణ కల్పించాలంటూ జూడాలు, వైద్యులు అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. స్విమ్స్‌ సంచాలకులు ఆర్​వీ.కుమార్‌, టీటీడీ విజిలెన్స్ అధికారి శివకుమార్‌రెడ్డి వైద్యులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు. టీటీడీ పర్యవేక్షణలో వైద్యులకు రక్షణ కల్పిస్తామని శివకుమార్‌రెడ్డి చెప్పినా వైద్యసిబ్బంది ససేమిరా అన్నారు.

"ఆ రోగి వచ్చి ఆమెను కొట్టారు. ఎందుకు కొట్టారో తెలియదు. అక్కడే ఉన్న వైద్యులు అప్రమత్తమై ఆయన నుంచి విడిపించే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ వాళ్లు ఎక్కడో ఉన్నారు. వారు వచ్చేలోగా ఏదైనా జరిగితే ఏవరిది బాధ్యత. రాత్రి విధుల్లో ఉంటే పరిస్థితి ఏంటి. రెండు వారాల క్రితం ఓ ఘటన జరిగితే జేఈవోకి ఫిర్యాదు చేశాం. ఇంతవరకూ దానిపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతారు. ఆ తర్వాత పట్టించుకోరు." - జూనియర్ వైద్యులు

టీటీడీ జేఈవో హామీతో ఆందోళన విరమణ : స్విమ్స్‌లో వైద్యుల ఆందోళనపై తిరుపతి కలెక్టర్, అధికారులతో సీఎంవో అధికారులు మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని సూచించారు. శనివారం రాత్రి పదిగంటల వరకు ఆందోళన కొనసాగింది. టీటీడీ జేఈవో గౌతమి వెళ్లి వైద్య సిబ్బంది రక్షణకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

వైద్యవిద్యార్ధిని హత్యపై కొనసాగుతున్న నిరసనలు - తోటి వైద్య విద్యార్ధులకు రాఖీలు కట్టిన జుడాలు - Protests on Medical Student Murder

కోల్‌కతా ఘటనపై కొనసాగుతున్న వైద్యుల నిరసనలు - రక్షణ కల్పించాలని డిమాండ్ - Doctors continue protest in State

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.