Patha Pantala Jatara 2024 In Sangareddy : చిరుధాన్యాల ప్రాముఖ్యత సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించి సాగు చేసే విధంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఈ సొసైటీ ద్వారా మహిళలు సొంతంగా వ్యవసాయం చేసి ఆర్ధిక లాభాలను అర్జిస్తున్నారు.
చదువుకోకపోయిన వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచనల మేరకు చిరుధాన్యాలను పండిస్తూ వాటిని మార్కెట్లో సొసైటీ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విధాన్నాన్ని రాబోయే తరాలకూ అందించాలనే ఉద్దేశంతో పాత పంటల జాతర పేరుతో నెల రోజుల పాటు వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఎడ్ల బండి ఊరేగింపు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో డీడీఎస్ ఆవరణం ఓ జాతరను తలపించింది.
పాత పంటల జాతరతో నేటితరానికి కొత్త సందేశం
Old Crops Fair In Zaheerabad : 23 ఏళ్లుగా ఈ ప్రాంతం మెుత్తం సేంద్రియ ఎరువులపైనే మక్కువ చూపుతూ వ్యవసాయంలో పూర్తిగా చిరు ధాన్యాలను పండిస్తూ వాటి వల్లే మంచి ఆరోగ్యం లభిస్తోందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూడా డీడీఎస్ పేరు ప్రఖ్యాతలను సంపాధించింది. మారుమూల గ్రామాల్లోనూ ఇప్పుడు మిల్లెట్ మిషన్ అంటూ ఈ పంటల సాగుకు ప్రయత్నిస్తున్నారు. తాము చిరుధాన్యాలు పండించడం ద్వారా భూమిలో సారాన్ని కాపాడుకుంటున్నామని మహిళా రైతులు చెబుతున్నారు. వ్యవసాయంలో మహిళలకు అనుమానాలు తలెత్తితే వాటిని నివృత్తి చేయడానికి జహీరాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పుడు ముందుండి వారిని నడిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Patha Pantala Jatara 2024 : ప్రస్తుత తరాల వారికి పూర్తి స్థాయిలో పంటపొలాలు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్తితి ఏర్పడింది. చిరు ధాన్యాలు ఎక్కడ నుంచి ఏ విధంగా తయారవుతున్నాయో కూడా కనీస అవగాహన లేకుండా పోతుంది. అలాంటి వారికి వ్యవసాయం గురించి తెలియజెేయడానికి ఇలాంటి జాతరలను నిర్వహిస్తున్నట్లు మహిళా రైతులు చెబుతున్నారు. తాము పండించిన ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వీటి గురించి తెలుసుకున్నారని చెబుతున్నారు.
వీరితో పాటు స్థానికంగా ఉన్న ఆహారానికి సంబంధించిన కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా సందర్శించి మహిళా రైతులను అడిగి వ్యవసాయ మెళుకవలను తెలుసుకున్నారు. తాము పండించిన ఉత్పత్తులను నేరుగా తామే విక్రయించడంతో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ జాతర వల్ల ప్రధానంగా ఇక్కడ విధివిధానాలు దేశవ్యాప్తంగా ప్రచారం జరిగి అంచలంచలుగా రైతులు సేంద్రియ పద్దతిలోకి ప్రవేశించాలనే ఉపాధ్యాయులు కూడా ఆశిస్తున్నారు. ఈ మహిళలను ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయంలో మంచి లాభాలు అర్జించవచ్చు. అధిక దిగుబడే లక్ష్యం కాకుండా ఆరోగ్యవంతమైన పంటను దిగుబడి చేస్తున్నామన్న ఆత్మసంతృప్తి వీరిలో పుష్కలంగా కనిపిస్తోంది.
Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు
Crop Damage in Mahabubnagar : వానలు లేక ఎండిపోతున్న పంట.. మళ్లీ రైతన్నకు తప్పని ఇబ్బందులు