ETV Bharat / state

జగన్ సభలంటే బెంబేలెత్తుతున్న ప్రయాణికులు - ఒక్క బస్సునూ వదలట్లేదుగా! - CM Jagan Meetings - CM JAGAN MEETINGS

Passengers Facing Difficulties Due to Allocating RTC Buses to Jagan Meetings: ఐదేళ్లపాటు ప్రభుత్వ కార్యక్రమాల కోసం బలవంతంగా ప్రజలను తరలించేందుకు వందలు, వేల ఆర్టీసీ బస్సులు మళ్లించి ప్రయాణికులకు సీఎం జగన్ నరకం చూపించారు. ఇటీవల నాలుగుచోట్ల నిర్వహించిన 'సిద్ధం' సభలకూ 3 వేలకు పైగా చొప్పున బస్సులు తీసుకున్నారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇకపై తమకు కష్టాలు ఉండవని ప్రయాణికులు భావించారు. కానీ జగన్ ఇప్పుడూ వదలట్లేదు. మదనపల్లెలో మంగళవారం నిర్వహించనున్న'మేమంతా సిద్ధం సభ' కోసం వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు తీసుకుని ప్రయాణికులు ఏమైపోతే మాకేంటనే నిర్లక్ష్య ధోరణితో జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

rtc_buses_to_jagan_meetings
rtc_buses_to_jagan_meetings
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 7:12 AM IST

Updated : Apr 1, 2024, 9:53 AM IST

జగన్ సభలంటే బెంబేలెత్తుతున్న ప్రయాణికులు - ఒక్క బస్సునూ వదలట్లేదుగా!

Passengers Facing Difficulties Due to Allocating RTC Buses to Jagan Meetings: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిత్యం కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి తరుణంలో రాయలసీమ జిల్లాల్లోని ప్రయాణికులకు సీఎం జగన్ కొద్ది రోజులుగా నరకం చూపిస్తున్నారు. 'మేమంతా సిద్ధం' పేరిట వైసీపీ నిర్వహిస్తున్న సభలకు వెయ్యి నుంచి పదకొండు వందల చొప్పున ఆర్టీసీ బస్సులు మళ్లించి ప్రయాణికులు గంటల తరబడి ఎండలో వేచి ఉండేలా చేస్తున్నారు.

వందల కోట్ల ఆస్తులు - వైసీపీ అభ్యర్థులు పేదవాళ్లే - జనం చెవిలో జగన్​ పువ్వులు - Jagan Lies About Candidates

ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి 'మేమంతా సిద్ధం' అంటూ ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరులో సభలు నిర్వహించారు. సగటున వెయ్యి బస్సుల్లో ప్రజలను తరలించారు. మంగళవారం మదనపల్లెలో జరగనున్న సభకూ రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని 40 డిపోల నుంచి వెయ్యీ 57 బస్సులు మళ్లిస్తున్నారు. ఇందులో 484 ఎక్స్‌ప్రెస్‌లు, 573 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి మదనపల్లె 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి జిల్లాలోని గూడూరు నుంచి 210 కిలోమీటర్లు, సూళ్లూరుపేట నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా ఆయాచోట్ల నుంచి బస్సులు పంపిస్తుండటంపై ప్రజలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

జగన్​ విధ్వంస పాలనకు వికృత రూపం- గ్రామాల్లో పనులు చేయరు, ఎవరైనా చేస్తే ఊరుకోరు - Development works in villages

తిరుపతి, తిరుమల, అలిపిరి, మంగళం డిపోల సర్వీసులన్నీ ఎక్కువగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని నడిపిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులు, ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ముగియడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులు పెంచాలి. కానీ ఆయా డిపోల నుంచి పెద్దసంఖ్యలో బస్సులను సీఎం జగన్ సభలకు మళ్లిస్తున్నారు. మరోవైపు సభకు హాజరయ్యే వైసీపీ కార్యకర్తలకు పార్టీ నేతలు మద్యం, చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. వారు బస్సుల్లోనే మద్యం తాగుతూ, బిర్యానీ తింటున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఇలా చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

జగన్ సభలకు ఎన్ని ఆర్టీసీ బస్సులు కావాలంటే అన్ని బుక్ చేసుకోండి అంటూ ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నాయకులతో పేర్కొనడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. మొన్నటి వరకు అధికార పార్టీ చెప్పినట్లు వినాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు వాపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతలకు అధికారులు దాసోహం అవుతున్నారనే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Last Updated : Apr 1, 2024, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.