ETV Bharat / state

'గుర్తులేదు, మర్చిపోయా' - సీఐడీ విచారణలో చైతన్య సమాధానాలు! - PANUGANTI CHAITANYA TO CID CUSTODY

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో చైతన్యను విచారించిన సీఐడీ

TDP Central Office Attack Case Updates
TDP Central Office Attack Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 8:15 AM IST

TDP Central Office Attack Case Updates : మనం అభిమానించే జగన్‌ను టీడీపీ నాయకులు దూషిస్తే సైలెంట్‌గా ఉంటావేంటని వైఎస్సార్సీపీ కీలక నేతలు తనను రెచ్చగొట్టి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పంపారని కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కస్టడీలో పలు అంశాలపై అధికారులు అతణ్ని ప్రశ్నించగా గుర్తు లేదు, మరిచిపోయానని బదులిచ్చినట్లు సమాచారం. విచారణకు చైతన్య సహకరించని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

CID Custody on Panuganti Chaitanya : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఏ1 పానుగంటి చైతన్య మూడు రోజుల సీఐడీ కస్టడీలో అధికారుల విచారణకు సహకరించలేదని సమాచారం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఉద్దేశం ఏంటి? దాడికి రెచ్చగొట్టిన వైఎస్సార్సీపీ పెద్దలు ఎవరు? వంటి ప్రశ్నలను సీఐడీ అధికారులు చైతన్యను అడగ్గా పట్టాభిపై భౌతికదాడి చేసేందుకే టీడీపీ కార్యాలయంపై దాడి చేశామని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

నాటి సీఎం జగన్‌ను టీడీపీ నాయకుడు పట్టాభి దూషిస్తే చూస్తూ మౌనంగా ఎలా ఉంటావంటూ ముఖ్య నేతలు తనను రెచ్చగొట్టినట్లు చైతన్య విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలు దాడి చేసే వరకూ పట్టాభి ఎవరో కూడా తనకు తెలియదని, వైఎస్సార్సీపీ పెద్దలు చెప్పారని దాడి చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. రెచ్చగొట్టిన ముఖ్య నేతలు ఎవరని పదే పదే ప్రశ్నించినా పేర్లు వెల్లడించకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెచ్చగొట్టి దాడికి పంపారు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైఎస్సార్సీపీ ఆఫీసులో ఆ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారని పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. మూడు రోజుల సీఐడీ కస్టడీలో అతణ్ని మొదటి రోజు విచారణకు సహకరించలేదు. రెండో రోజు దాడికి సంబంధించి కీలక విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్‌, రామిశెట్టి విశాల్‌ తదితరులతో గుంటూరు నాజ్‌ సెంటర్లో ఉన్నట్లు చైతన్య చెప్పినట్లు సమాచారం. అప్పుడు వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి ఫోన్‌ చేసి వెంటనే తనను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని సూచించినట్లు అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

కీలకాంశాలపై ప్రశ్నించిన సీఐడీ : వైఎస్సార్సీపీ నాయకుడు ఉమామహేశ్వరరెడ్డి నాజ్‌ సెంటర్‌కు రాగా అనుచరులు కారులో తాడేపల్లికి వెళ్లినట్లు విచారణలో చైతన్య వెల్లడించినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో ఉమామహేశ్వరరెడ్డితో పాటు గడ్డంతో ఉన్న మరో వ్యక్తి ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లే సమయానికి పార్టీ ముఖ్య నేతలు అక్కడే ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి వచ్చిన ఆదేశాలతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 200 మంది కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్లినట్లు చైతన్య పోలీసులకు వివరించినట్లు సమాచారం.

Mangalagiri TDP Office Case Updates : జగన్‌ను ధూషించిన పట్టాభిపై దాడి చేయాలని అనుకున్నామని ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యాలయంలో ఉన్న వారిపై దాడి చేశామని అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేవినేని అవినాశ్‌ మరి కొందరు మంగళగిరి వచ్చి దాడి తీరును పరిశీలించారని ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంగళగిరి రూరల్‌ సీఐ, ఓ కానిస్టేబుల్‌పై తాను దాడి చేసినట్లు పానుగంటి విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మూడు రోజుల కస్టడీ ముగియడంతో నేడు చైతన్యను సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - రెండు దాడి కేసులు సీఐడీకి బదిలీ

పోలీసుల ఎదుట అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల – వేలు చూపించి పొన్నవోలు వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.