ETV Bharat / state

ఏపీ టీడీపీ కొత్త‌ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు - AP TDP President Palla Srinivasa

Palla Srinivasa Rao Appointed as AP TDP President : ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో పల్లాకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

AP Politics 2024
Palla Srinivasa Rao appointed as AP TDP President (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 10:47 PM IST

Palla Srinivasa Rao Appointed as AP TDP President : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా, ఇది మూడోసారి కావడం విశేషం.

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం : తొలుత కళా వెంకట్రావుకు అప్పగించగా, గత ఐదేళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు. గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో పల్లా అనేక ఇబ్బందులకు గురయ్యారు. వైఎస్సార్సీపీ రాగానే ఆ పార్టీ నేతలు పల్లాను పార్టీ మార్చేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో ఏయూలో పనిచేస్తున్న ఆయన సతీమణితో ఇంట్లో ఒత్తిడి తెచ్చారు. విజయసాయిరెడ్డితో అన్నివైపుల నుంచి పొగపెట్టారు. అయినా పల్లా పార్టీని వీడలేదు.

TDP State President Palla Srinivas : వైఎస్సార్సీపీలోకి వెళ్తే తనకు రాజకీయ సమాధేనని, వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. దీన్ని సహించలేని విజయసాయి గాజువాక ప్రధాన సెంటర్‌లో ఉన్న పల్లా ఆస్తిపై కన్నేశారు. దాన్ని ఎలాగైనా కొట్టేయాలని జీవీఎంసీని ఆదేశించారు. రాత్రికిరాత్రే అందరినీ గృహనిర్బంధాలు చేసి భవనంలోని కొంత భాగాన్ని కొట్టించేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై పలు కేసులు మోపారు.

విశాఖ ఉక్కుపై పల్లా ఆమరణ దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి శిబిరాన్ని కూల్చేసి ఈడ్చుకుపోయారు. అయినా ఎక్కడా తలొగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటి వరుసలో ఉండి పోరాటాలకు నాయకత్వం వహించారు. మంత్రి పదవి వస్తుందని అనుయాయులంతా ఆశగా ఎదురుచూడగా, ఎప్పుడు ఏది ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసు అని చెబుతూ వచ్చారు. ఇప్పడు పల్లాకు అధ్యక్ష పదవి ఖరారు చేయడంతో సరైన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్‌నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారు."- చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - Rushikonda building visuals

తనకు కేటాయించిన శాఖలపై మనసులో మాట చెప్పిన పవన్​ - ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.