Palla Srinivas new state president of TDP : ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాస రావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు పదవుల కేటాయింపులో అగ్రతాంబూలం ఇస్తూ వచ్చిన పార్టీ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా మరోసారి బీసీ నేతకే ఇవ్వాలని నిర్ణయించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర అధ్యక్షునిగా ఖరారు చేసినట్లు సమాచారం.
నన్ను జైలుకు పంపినందుకు నేను చేయబోయేది ఇదే : ఏపీ సీఎం చంద్రబాబు - AP CBN Fires IAS And IPS
తొలిసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్ నేత కళా వెంకట్రావుకు కేటాయించగా, గత ఐదేళ్ల ప్రతిపక్షంలో ఈ బాధ్యతలను మరో సీనియర్ అచ్చెన్నాయుడు నిర్వర్తించారు. తాజాగా అచ్చెన్నాయుడును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల ప్రతిపక్షంలో బాగా ఇబ్బందులకు గురైన వారిలో పల్లా ఒకరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లాను పార్టీ మార్పు కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఏయూలో పని చేస్తున్న ఆయన భార్యతో ఇంట్లో బాగా ఒత్తిడి పెంచారు. విజయసాయిరెడ్డి అయితే అన్నివైపుల నుంచి పల్లాను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పోరాడి నిలబడ్డారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పల్లా శ్రీనివాస్ గట్టి పోరాటమే చేశారు. ఆమరణ దీక్ష చేస్తుంటే బలవంతంగా అర్ధరాత్రి శిబిరాన్ని కూల్చేసి ఈడ్చుకుపోయారు. ఆఖరికి చంద్రబాబు వచ్చి ఆసుపత్రిలో దీక్ష విరమింప చేసేదాకా అలానే కొనసాగించారు. ఈ ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 95,235 ఓట్లతో పల్లా శ్రీనివాస్ చరిత్ర సృష్టించారు.
ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు - పవన్ కల్యాణ్‌కు ఏ శాఖలంటే? - AP CABINET MINISTERS DEPARTMENTS