ETV Bharat / state

బీఆర్​ఎస్​ నేత క్రిశాంక్​ను విచారిస్తున్న పోలీసులు - 'మీరే మార్ఫింగ్​ చేశారా? లేక ఇంకా ఎవరైనా పంపించారా? - BRS Leader Krishank Interrogate - BRS LEADER KRISHANK INTERROGATE

BRS Leader Krishank in OU Police Custody : బీఆర్​ఎస్​ నేత క్రిశాంక్​ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అతనికి అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. అసలు డాక్యుమెంట్​ మీ వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ఓయూ అధికారుల పేరుతో ఫేక్​ సర్క్యులర్​ను జారీ చేసినందుకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

BRS Leader Krishank in OU Police Custody
BRS Leader Krishank in OU Police Custody (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 3:39 PM IST

BRS Leader Krishank is Being Interrogate by OU Police : సామాజిక మాధ్యమాల్లో ఓయూ అధికారుల పేరుతో ఫేక్​ సర్క్యులర్​ లెటర్​ను వైరల్​ చేసిన బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ఇంఛార్జి క్రిశాంక్​ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓయూ అధికారిక లెటర్​ను మార్ఫింగ్​ కేసులో అరెస్టు అయి జ్యూడిషియల్​ కస్టడీలో ఉన్న క్రిశాంక్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన 24 గంటల కస్టడీలో భాగంగా అతనిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు. డాక్యుమెంట్​ మీ వద్దకు ఎలా వచ్చిందని క్రిశాంక్​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే మీరే మార్ఫింగ్​ చేశారా లేదా మీకు ఎవరైనా మార్ఫింగ్​ చేసి దానిని మీకు పంపించారా?. ఈ డాక్యుమెంట్​ ఎలా ఎక్కడెక్కడ సర్క్యులేట్​ చేశారని పోలీసులు ప్రశ్నించారు.

క్రిశాంక్​ వెంట అతని అడ్వకేట్​ లక్ష్మణ్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చారు. అడ్వకేట్​ మాట్లాడుతూ పోలీసులకు విచారణ సమయంలో పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలపై వచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగాలని అడ్వకేట్​ కోరారు. అంతకు ముందు చంచల్​గూడ జైలు నుంచి బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ఇంఛార్జి క్రిశాంక్​ను ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్​కి తరలించారు.

అసలేం జరిగింది : ప్రతి ఏటా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మెస్​లు మూసివేతపై సర్కులర్​ జారీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అధికారులు సర్కులర్​ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ఇంఛార్జి క్రిశాంక్​, నాగేందర్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ హైదరాబాద్​ నుంచి కొత్తగూడెం వెళుతుండగా పంతంగి టోల్​ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సీఎం రేవంత్​ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై సీఎం తీవ్రంగానే స్పందించి, విచారణకు ఆదేశించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఓయూపై దుష్ప్రచారం కేసు - పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత - BRS Leader Arrest in OU issue

విద్యార్థినుల బాత్​రూంలోకి చొరబడిన దుండగులు - రక్షణ కల్పించాలంటూ అమ్మాయిల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.