Gold & Diamond Ornaments Gift to Tiruchanur Sri Padmavati Ammavaru on Behalf of Tirumala Srivaru : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి శ్రీవారి తరఫున టీటీడీ 3 కిలోల బంగారు, వజ్రాభరణాలను కానుకగా పంపింది. శ్రీ పద్మావతీ పంచమీ తీర్థం పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి ఈ ఆభరణాలు అలంకరించారు. రూ. 1.11 కోట్ల విలువైన బంగారు పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, వజ్రాల హారం, వజ్రాలు పొదిగిన గాజులు, కమ్మలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేయించింది.
బంగారు కాసుల హారాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తీసుకొచ్చి పుష్కరిణి మండపంలో అర్చకులకు అందజేశారు. స్నపన తిరుమంజనం సమయంలో శ్రీవారు పంపిన ఆభరణాలు ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?