Order for Inquiry on YSRCP Leaders Roja and Dharmana Krishnadas: ఆడుదాం ఆంధ్ర పేరుతో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ చేసిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా అవినీతికి పాల్పడ్డారని ఆటపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Irregularities in Aadudam Andhra : ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అధికార వైఎస్సార్సీపీ నేతలు అరాచకంగా వ్యవహరించారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకంటూ ప్రగల్బాలు పలికారు. కానీ ప్రతిభావంతులను పక్కన పెట్టి ఎవరు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎవరిని విజేతలుగా ప్రకటించాలనే విషయాలను ఆ పార్టీ నేతలే నిర్ణయించారు. క్రీడా స్ఫూర్తి, క్రీడా నిబంధనలు లేవు. శాప్, ఇతర అధికార యంత్రాంగమంతా ప్రేక్షక పాత్ర వహించగా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఆడుదాం ఆంధ్రాను రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల ప్రజాధనంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
దోచుకుంది చాలు ఇక దయచేయండిక!- అరాచక మంత్రులను మట్టికరిపించిన ఓటర్లు - Defeat Of YSRCP Ministers