Find The Difference In This Photo : "ప్రాబ్లమ్స్.. ప్రాబ్లమ్స్.. ప్రాబ్లమ్స్.. వియ్ డోంట్ లైక్ ప్రాబ్లమ్స్.. బట్, ప్రాబ్లమ్స్ లైక్స్ హస్. సో.. వియ్ కాంట్ అవైడ్" నిజమే కదా? మనిషి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్లడమే జీవితం. అందుకే బ్లూస్లీ అంటాడు.. "సమస్యలు రాకుండా చూడమని దేవుడిని కోరుకోకు. ఆ సమస్యలను ఫేస్ చేసే కెపాసిటీ ఇవ్వు అని కోరుకో." అని సూచిస్తాడు. బ్రూస్లీ చేసిన ఈ సూచన చాలా బాగుంది కదా?! ఇక నుంచి ఇలా ప్రయత్నించి చూడండి. అప్పుడు ధైర్యంగా ముందుకు సాగడమే కాకుండా.. సమస్యలనే ఓ ఆట ఆడుకునే తత్వం అలవాటవుతుంది.
మరో పని చేయాలి..
దీంతోపాటుగా చేయాల్సిన మరో పని ఏమంటే.. రిలాక్స్. ప్రాబ్లమ్స్‌ను డీల్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్‌గా అదే పనిలో ఉండొద్దు. కాస్త గ్యాప్ తీసుకొని రిలాక్స్ అవ్వాలి. ఈ గ్యాప్‌లో కొద్దిగా చిల్ అవ్వాలి. దీంతో.. మైండ్ మళ్లీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు ఫుల్ ఎఫర్ట్‌తో మన పనిపై ఫోకస్ చేయొచ్చు. అందుకే.. ఓ సారి ఈ పిక్‌పై దృష్టి పెట్టి.. ఈ చిన్న పజిల్ సాల్వ్ చేయండి.
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీస్కో భయ్యా - ఈ తేడాలు కనిపెట్టండి - ఫుల్లు రిలాక్స్!
మెదడుకు మంచి మేత..
ఇలాంటి బ్రెయిన్ టీజర్లు మెదడుకు మరింత పదును పెడతాయి. తరచూ ఇలాంటివి డీల్ చేయడం వల్ల.. క్రియేటివ్‌గా ఆలోచించే విధానం అలవడుతుంది. దృష్టి, జ్ఞాపకశక్తి, తెలివితేటలూ మెరుగుపడతాయి. ఇక, ఈ ఫొటోలో విషయం ఏమంటే.. ఇక్కడ మూడు చిత్రాలు ఒకేలా ఉన్నాయి కదా. అయితే.. ఒకటి మాత్రం కాస్త తేడాగా ఉంది. డిఫరెంట్‌గా ఉన్న ఆ ఫొటో ఏదో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అయితే.. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకిస్తున్న టైం 12 సెకన్లు మాత్రమే. మరి, ఇంక లేట్ చేయకుండా ట్రై చేయండి.
బొమ్మే కదా అని తీసిపారేయకండి - ఈ చిత్రంలోని తేడాలు కనిపెడితే మీలో అద్భుతం జరుగుతుంది!
కంటిన్యూ చేయండి..
ఏంటి..? ఎంత చూసినా తేడాగా ఉన్న ఫొటో ఏదో కనిపెట్టలేకపోతున్నారా? అయితే.. ఆన్సర్ కోసం ఓసారి కింద ఫొటోపై లుక్కేయండి. అక్కడ రెండో ఫొటోలో.. చెయ్యి దగర హెయిర్ విషయంలో ఉన్న తేడాను మీరు గమనించొచ్చు. అయితే, ఇచ్చిన సమయంలో పరిష్కరించిన వారికి అబ్జర్వేషన్ ఎక్కువగా, మెదడు వేగంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే.. సాల్వ్ చేయలేకపోయిన వారు చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్ రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇందులో మాస్టర్స్ అవుతారు. సో.. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్.
మీ ఐక్యూ పవర్ ఎంతో టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి!