Find The Differences Between These Two Images : ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఒత్తిడి. ఈ పని, ఆ పని అన్న తేడా లేకుండా ఏ పని చేస్తున్నవారిలోనైనా మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ మెంటల్ ప్రెజర్ కారణంగా.. మానసిక ప్రశాంతత కరువైపోవడం మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో ఎన్నో రోగాలు చుట్టు ముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. మనసును కూల్‌గా ఉంచుకోవాలని, అందుకోసం ధ్యానం, యోగా వంటివి చేయాలని కూడా సూచిస్తుంటారు. అయితే.. ఈ చిత్రాల మధ్య తేడా కనిపెట్టడం వంటి పనులు చేస్తే కూడా మనసు రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మనసు తేలికపడడంతోపాటు బ్రెయిన్ కు మంచి వ్యాయామం అవుతుందని పరిశోధనలు తేల్చాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుందని, తార్కికం జ్ఞానం కూడా అలవడుతుందని తేల్చాయి. 2017లో జర్నల్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌లో ఓ రీసెర్చ్ పబ్లిష్ అయ్యింది. "చిత్రాల మధ్య తేడాలు కనిపెట్టడం - దృష్టి, జ్ఞాపకశక్తి, తార్కికం మధ్య సంబంధం" అనే అంశంపై చేసిన పరిశోధనలో 100 మంది పాల్గొన్నారు. సాధారణ సమయంతో పోల్చితే.. చిత్రాల మధ్య తేడాలు కనిపెట్టే సమయంలో వీరి మెదడు చురగ్గా పనిచేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. జ్ఞాపకశక్తి, తార్కికంగా ఆలోచించడం కూడా మెరుగు పడిందని గుర్తించారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లియోన్ ఈ రీసెర్చ్‌కు నేతృత్వం వహించారు.
'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్‌కు స్టార్ నటి సలహా! - Zeenat Aman
6 తేడాలు ఉన్నాయి..
సో.. దీన్ని బట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల.. మెదడుకు ఎంత మేలు జరుగుతుందో అర్థమైంది కదా? కాబట్టి.. ఇప్పుడు ఈ చిత్రంలో తేడాలు కనిపెట్టే పని మొదలు పెట్టండి. ఇందులో మొత్తం 6 తేడాలు ఉన్నాయి. 20 సెకన్లలోనే మీరు వీటిని గుర్తించాలి. దీనివల్ల మీ అబ్జర్వేషన్ మరింత మెరుగు పడుతుంది. ఇన్ టైమ్‌లో కనిపెడితే మీ గ్రహణశక్తి చాలా పవర్ ఫుల్ అని అర్థం. ఒకవేళ కనిపెట్టలేకపోయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. "సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నాడు వేమన. అంటే.. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే అన్నమాట. కంటిన్యూ చేయండి. టైమ్ ముగిసిపోయినా కనిపెట్టలేకపోతే.. సమాధానాల కోసం ఇక్కడ చూడండి.
ఆన్సర్స్ ఇవే..
1. ఏనుగు దంతం
2. నక్క కాలు
3. నక్క చెవి
4. చెట్టు కొమ్మ
5. పొద
6. రాయి
మీ స్కిన్‌టోన్‌కి సరిపోయే - లిప్‌స్టిక్ ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసా? - How To Choose Lipstick