Find the Difference in This Photo: టెన్షన్ లేని లైఫ్ ఉండదంటే మీరు నమ్ముతారా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టెన్షన్. టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి ధ్యానం, యోగా, మ్యూజిక్, డ్యాన్సింగ్.. అంటూ నచ్చిన వ్యాపకం అలవాటు చేసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. అయితే టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో బ్రెయిన్‌కు పదునుపెట్టే పజిల్స్, రెండు బొమ్మల మధ్య తేడాలు కనిపెట్టడం వంటివి కూడా ఒకటి.
అయితే ఒకప్పుడు పజిల్స్, సుడోకు వంటి మెదడుకు పదును పెట్టేవన్నీ న్యూస్ పేపర్స్‌లో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియాలో రకరకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్, స్పాట్ ది డిఫరెన్స్, సీక్ అండ్ ఫైండ్, ట్రిక్కీ పజిల్స్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో పిక్చర్ పజిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి ఫన్‌గానూ ఉంటూ చాలా కాలక్షేపాన్ని అందిస్తున్నాయి.
ఈ బ్రెయిన్ టీజర్లు మెదడుకు పదును పెడతాయి. లాజిక్‌ను సవాలు చేస్తాయి. క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, దృష్టి, జ్ఞాపకశక్తి, తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. లోపాలను కనుగొనడం, సీక్రెట్ కోడ్స్ ఛేదించడం లేదా దాగిన వస్తువులను గుర్తించడం వంటి వివిధ రకాల సవాళ్లతో పిక్చర్ పజిల్స్ వస్తాయి. మెదడును ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా పిక్చర్ పజిల్స్ సాధన చేయాలి. అవి మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అందుకోసమే మీ కోసం ఓ పజిల్‌ను తీసుకొచ్చాం.
మీకు ఇచ్చిన పజిల్లో ఒకటే ఫ్రేమ్‌లో మూడు ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో రెండు మాత్రం ఒకేరకంగా ఉండి మిగతా ఒక్కటి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కాబట్టి ఈ ఫొటోలో డిఫరెంట్‌గా ఉన్నది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి మీకిస్తున్న టైం కేవలం 12 సెకన్లు మాత్రమే. మరి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
ఏంటి ఎంత వెతికినా ఏ ఫొటో తేడానో కనిపించడం లేదా? అయితే ఆన్సర్ కోసం ఓసారి కింద ఫొటోపై లుక్కేయండి. అయితే ఇచ్చిన సమయంలో పరిష్కరించిన వారికి పదునైన చూపు, వేగంగా పనిచేసే మెదడు ఉందని చెప్పవచ్చు. సాల్వ్ చేయలేకపోయిన వారు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌ను రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇందులో మాస్టర్స్ అవుతారు. సో ఈసారికి ఆల్ ది బెస్ట్..