ETV Bharat / state

మేయర్, 12 మంది కార్పొరేటర్ల రాజీనామా- వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ - YSRCP Losing Ongole Corporation - YSRCP LOSING ONGOLE CORPORATION

Ongole Mayor and 12 Corporators Resigned to YCP : ఒంగోలులో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ సుజాతతోపాటు మరో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలే విశాఖలో వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. ఇప్పటికే అధికారం కోల్పోయి అధఃపాతాళానికి పడిపోయిన జగన్‌కు కార్పొరేటర్లు వరుసగా పార్టీని వీడుతుండటం తలనొప్పిగా మారింది.

Ongole Mayor and 12 Corporators Resigned to YCP
Ongole Mayor and 12 Corporators Resigned to YCP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 5:14 PM IST

Ongole Mayor and 12 Corporators Resigned to YCP : ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా కేంద్రం ఒంగోలు నగర పాలకవర్గంలో వైఎస్సార్సీపీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయర్ గంగాడ సుజాతోపాటు మరో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరి పసుపు కండువాలు కప్పుకున్నారు. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బలపరిచి, గెలిపించిన.. మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి జలక్ ఇచ్చారు.

బాలినేనికి కోలుకోలేని ఎదురుదెబ్బ : దీంతో ఒంగోలులో వైఎస్సార్సీపీ పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. బాలినేనికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరంతా ఆ పార్టీకి రాజీనామా చేయడం కోలుకోలేని దెబ్బ తగిలిందని చెబుతున్నారు. 50 డివిజన్లు ఉన్న నగరపాలక సంస్థలో కేవలం ఆరుగురు తెలుగుదేశం, ఒక జనసేన కార్పొరేట్లర్లు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు చాలావరకు నామినేషన్ వేయనీయకుండా, భయాందోళనకు గురిచేసి ఫలితాలను ఏకపక్షం చేసుకున్నారు.

'పిఠాపురంలో పెత్తనం చేయాలన్న ఆలోచన లేదు' - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా - Shock for YSRCP

టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు : ఇప్పటివరకు నగరపాలక సంస్థలో పూర్తి మెజార్టీ ఉండటంతో బాలినేని ఆడిందే ఆటగా సాగైంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో పాటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీంతో వైఎస్సార్సీపీలో ఉన్న క్యాడర్ ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒంగోలు నగరపాలక సంస్థలు కార్పొరేటర్లు ఒక్కొక్కరు తెలుగుదేశం ఎమ్మెల్యే జనార్దన్ కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒంగోలు కార్పొరేషన్​లో టీడీపీ జెండా : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు. ఎన్నికల తర్వాత కూడా ఒక్కొక్కరుగా పార్టీలో చేరుతున్నారు. ఇలా ఇప్పటి వరకు టీడీపీలోకి 18 మంది చేరారు. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున గెలుపొందిన ఏడుగురితో కలిపి మెుత్తం సభ్యుల సంఖ్య 25కు చేరుతుంది. మరికొందరు సైతం వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే ఒంగోలు కార్పొరేషన్​లో తెలుగుదేశం జెండా ఎగురవేయడం ఖాయం.

నాడు పార్టీ, ప్రభుత్వంలో నెం.2 - నేడు పుంగనూరులోనే పట్టు కోల్పోతున్న పెద్దిరెడ్డి - PEDDI REDDY POLITICAL

వైఎస్సార్సీపీ విధేయ వీసీ రాజీనామా- ఉద్యోగులు, విద్యార్థుల సంబరాలు - ANU VC Rajasekhar Resigned

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.