TDP and YSRCP workers clash: ఎన్నికల ఫలితాలను ఊహించని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందని సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరులో టీడీపీ గెలుపు సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యక్తపై వైఎస్సార్సీపీ దాడి చేసిన ఘటనలో ఖాసీం అనే వ్యక్తి మృతి చెందగా, అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై దాడి ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గుంటూరు జిల్లా: టీడీపీకి 164 సీట్ల భారీ మెజారిటీతో గెలుపొందడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామాంలో సంబరాలు నిర్వహించేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఖాసీం అనే టీడీపీ కార్యకర్తతో వైఎస్సార్సీపీ కార్యకర్త కమల్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగడంతో కమల్ ఖాసీంపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబసభ్యులు మంగళగిరి ఎన్నారై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఖాసీం మృతి చెందాడు. వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేకే కమల్ ఈ దారుణానికి పాల్పడ్డారని ఖాసీం బంధువులు వెల్లడించారు. కమల్‌పై గతంలోనూ నేర చరిత్ర ఉందని, గంజాయి మత్తులో దాడి చేశాడని ఖాసీం కుటుంబ సభ్యులు తెలిపారు. కమల్‌పై చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఖాసీం కుటుంబసభ్యులు, గ్రామస్థులు పేర్కొన్నారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు- ఇద్దరు మృతి - RTC Bus Hit Auto In Anantapur District Two Died
అనంతపురం జిల్లా గుత్తి మండలం టీ కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపొందడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వైఎస్సార్సీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడి, టీడీపీ వాహనాలకు ద్విచక్ర వాహనాన్ని అడ్డు పెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఏడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వ్యక్తులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో ఓర్వలేక వైఎస్సార్సీపీ మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం మండలంలో వైఎస్సార్సీపీ మూకల దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారు. కూటమి గెలుపుతో టీడీపీ కార్యకర్తలు బైకులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఓటమి అక్కసుతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ర్యాలీకి అడ్డుగా పెట్టి ఘర్షణకు దిగాడు. గ్రామస్తులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి అక్కడ్నుంచి పంపించేశారు. కొద్దిసేపటికి నోవా కళాశాల వద్దనున్న టీడీపీ శ్రేణులపై , వైఎస్సార్సీపీ కార్యకర్తలు యర్రంశెట్టి నూకరాజు, మరికొంతమంది కత్తులు, కర్రలతో దాడి చేశారు. దాడిలో షేక్ ఇమ్రాన్, పారేపల్లి శ్రీనులకు గాయాలయ్యాయి. వెంటనే బాధితులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కూటమి అనూహ్య విజయం - హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు - tdp leaders on victory