ETV Bharat / state

సూర్యాపేట గురుకులానికి చెందిన మరో విద్యార్థిని సూసైడ్ - అసలేం జరుగుతోందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన - Girl Suicide Residential Suryapet

One More Girl Suicide in SC Residential School Suryapet : సూర్యాపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో మరో బాలిక ఆత్యహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్దామన్న రోజునే ఆత్మహత్యకు పాల్పడటంతో అనుమానాస్పదంగా మారింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలంటూ ఎక్స్ వేదికగా కోరారు.

Suryapet Gurukul Student Dies by Suicide
One More Girl Suicide in SC Residential School Suryapet
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 4:26 PM IST

One More Girl Suicide in SC Residential School Suryapet : గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చిన్న వయసులోనే విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. తాజాగా సూర్యాపేట మండలం ఐమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి అస్మిత (15) హైదరాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉపాధ్యాయుడు మందలించాడని- అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మాహత్యయత్నం

మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన అస్మిత సూర్యాపేటలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఇటీవల వైష్ణవి మృతి నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సెలవులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్​లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లింది. శనివారం హాస్టల్​కు తిరిగి వెళ్దామని తల్లి కుమార్తెతో చెప్పి పనికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఫ్యాన్​కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడింది.

Suryapet Gurukul Student Dies by Suicide : దీంతో పాఠశాలకు వెళ్దాం అని చెప్పిన రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది. మృతదేహాన్ని బంధువులు స్వగ్రామమైన బుర్కచర్లకు తరలించారు. అక్కడ నుంచి శవపరీక్ష చేసేందుకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అదే గురుకులంలో గత వారం ఇంటర్ విద్యార్థి వైష్ణవి అనుమానాస్పద స్థితిలో ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

హన్మకొండ ఎస్​ఆర్ యూనివర్సిటీలో విషాదం - పరీక్షలో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

BRS MLC Kavitha on Gurukul Students Suicides : అస్మిత ఆత్మహత్యపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గత కొద్ది కాలంలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఎమ్మెల్సీ కవిత విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. పూర్తి స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై దృష్టి సారించలేకపోతుందని మండిపడ్డారు. తక్షణమే పూర్తి స్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆమె 'ఎక్స్' వేదికగా కోరారు.

గీతం యూనివర్సిటీలో ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని బలవన్మరణం - వీడియో వైరల్

తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక తనువు చాలించిన విద్యార్థిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.