Officials Survey in Saraswathi Power Industry Lands by Dy CM Pawan Orders: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో వైఎస్ జగన్‌కు చెందిన సరస్వతి పవర్ సంస్థ భూముల్లో సర్వే చేసేందుకు అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో డీఆర్వో ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు, వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ నిన్న(శుక్రవారం) ఆదేశించారు. ఈ సంస్థకు 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగు చూసిన క్రమంలో ఉప ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో చర్చించారు.
ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియజేయాలని అధికారులను కోరారు. అలాగే అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించవలసిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు. వాగులు, వంకలు, కొండలు ఉన్నందున ఆ సంస్థకు పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలియజేయాలని పీసీబీని ఆదేశించారు. ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఆ కేసుకు ఆరు సంవత్సరాలు - ఇప్పటి వరకు విచారణకు హాజరవ్వని జగన్
కాగా, సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములు, ఆస్తుల విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్'కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ జగన్ మోహన్ రెడ్డి కోర్టు కెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్లో సరస్వతి పవర్ పేరుతో రైతుల నుంచి జగన్ ఎకరా రూ. 3 లక్షల చొప్పున భూములు కొనుగోలు చేశారు. మొత్తం 1,515.93 ఎకరాల వరకు ఉన్న మొత్తం భూమిలో వాగులు, వంకలు, కొండ పోరంబోకు వంటి ప్రభుత్వ భూములు కూడా కొద్ది మొత్తంలో ఉన్నాయి.
ఎవరి సొమ్ము ఎవరు పంచుకుంటారు? ప్రకృతి సంపద వైఎస్ కుటుంబ ఆస్తా?
తల్లి, చెల్లిని రోడ్డుపైకి లాగారు - జగన్‌లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదు: చంద్రబాబు