ETV Bharat / state

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన - పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు

Palamaner MLA Venkata Goud: ఎన్నికల కోడ్ నియమావళికి విరుద్ధంగా విద్యార్థులకు ఎమ్మెల్యే ఫొటోలు ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన ఘటనలో పలమనేరు ఎమ్మల్యేకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్యాడ్లు పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలు పాఠశాలలకు చెందిన సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

Palamaner MLA Venkata Goud
Palamaner MLA Venkata Goud
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 9:59 PM IST

పలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు

Palamaner MLA Venkata Goud: చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఫొటో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్డీఓ వెల్లడించారు. ఆర్డీఓ మనోజ్ రెడ్డి, డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలిపారు.

పలమనేరులో ఎన్నికలకోడ్ ఉల్లంఘనలపై ఆర్డీఓ మనోజ్ రెడ్డి, డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నియమావళికి విరుద్ధంగా, కొందరు వ్యక్తులు విద్యార్థులు రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న రైటింగ్ ప్యాడ్లను పంచారని తెలిపారు. ప్యాడ్ల పంపిణీపై సమాచారం రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు చేశామని పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి తెలిపారు. పకడ్బందీగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్న ప్యాడ్లను తీసుకుని వాటి స్థానంలో కొత్త ప్యాడ్లను విద్యార్థులకు అందించామన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం - చెత్తకుప్పలో జర్నలిస్టుల ఇంటి స్థలాల పత్రాలు

నిన్న రైటింగ్ ప్యాడ్లను అనుమతించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. విద్యార్థులకు ప్యాడ్లను పంపిణీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆర్టీఓ తెలిపారు. ప్యాడ్లపై స్థానిక ఎమ్మెల్యే వెంకట గౌడ్ ఫొటో ఉంది, అతనికి సైతం నోటీసులు పంపామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ అనంతరం ఆ నివేదికలను కలెక్టర్​కు పంపిస్తామని ఆర్డీఓ అన్నారు. ఎన్నికల నియమాలను అతిక్రమించిన వారు ఎలాంటి వారైనా, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

'నిన్న ఉదయం స్కూల్స్​లో పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు వచ్చారు. వారికి గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే ఫొటోతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే అధికారులంతా ప్రతి స్కూల్​ను సందర్శించారు, రైటింగ్ ప్యాడ్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ సిబ్బంది నోటీసులు జారీ చేశాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పంపిణీ కార్యక్రమాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్యాడ్ల పంపిణీ చేసింది ఎవ్వరో తెలియదు, ఇదే అంశంపై పోలీసు కేసు నమోదు చేశారు. ప్యాడ్ల పంపిణీపై ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చాం. ఎమ్మెల్యే స్పందన అనంతరం పూర్తి వివరాలను కలెక్టర్​కు నివేదికలు పంపిస్తాం.' -మనోజ్ రెడ్డి, ఆర్డీఓ

ఎన్నికల కోడ్ వచ్చినా డోట్ కేర్ - వైసీపీ ప్రచారకర్తలుగా వాలంటీర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.