ETV Bharat / state

రాజమహేంద్రవరంలో బుల్డోజర్లు - 21 ప్రాంతాల్లో 128 అక్రమ కట్టడాలే టార్గెట్ - Encroachments in Rajamahendravaram - ENCROACHMENTS IN RAJAMAHENDRAVARAM

Encroachments in Rajamahendravaram : వైఎస్సార్సీపీ పాలనలో రాజమహేంద్రవరంలో అడుగడుగునా కబ్జాల పర్వం కొనసాగింది. అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకొని నేతలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా డబ్బులు దండుకున్నారు. తాజాగా అధికారులు వీటిపై ఫోకస్ పెట్టారు. నెలరోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ చేపట్టారు.

Encroachments in Rajamahendravaram
Encroachments in Rajamahendravaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 12:33 PM IST

Updated : Sep 24, 2024, 1:12 PM IST

Illegal Constructions in Rajahmundry : చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రహదారులు, కాలువలు ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అంటూ గత వైఎస్సార్సీపీ హయాంలో చెలరేగిపోయారు. సుందరీకరణ పేరిట రూ.కోట్లు కుమ్మరించి నాసిరకం పనులు చేసేందుకు మొగ్గు చూపారే కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు నాడు ఏ చర్యలు లేవు.

ఇటీవల ఉక్కుపాదం మోపుతూ : మూలగొయ్యి నుంచి కోటిలింగాల ఘాట్‌కు వెళ్లేందుకు గతంలో 20 అడుగుల రోడ్డు ఉండేది. ఆక్రమణలకు గురై ఐదడుగులకు కుంచించుకుపోయింది. దీంతో కారు వెళ్లేందుకు సైతం అవకాశం లేదు. ఇటీవల పర్యటించిన కమిషనర్‌ ఆక్రమణల తొలగింపునకు నిర్ణయించారు. దీ మదన్‌సింగ్‌పేటలో రోడ్డు, కాలువలపై నిర్మాణాలు చేపట్టగా అధికారులు తొలగించారు.

మూడు బృందాల నియామకం : 50 డివిజన్ల పరిధిలోని 21 ప్రాధాన ప్రాంతాల్లో 128 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. 8 కిలోమీటర్ల మేర కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లపై వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మించేశారు. వీటిని తొలగించేందుకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పోలీసులతో కూడిన మూడు బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో 13 మందిని నియమించారు. రోజుకు 48 చోట్ల ఆక్రమణలు తొలగించనున్నారు.

నేతల అండదండలతో : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెట్టారు. నాయకుల చేతులు తడిపితే చాలు పట్టణ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు వచ్చేసేలా వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. వ్యాపార, వాణిజ్య కూడళ్లలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. మెయిన్‌ రోడ్డు, కోటగుమ్మం, నల్లమందు సందు, దేవీచౌక్, కోటిపల్లి బస్టాండ్, దానవాయిపేట, గుండువారి వీధి, తాడితోట, కంబాలచెరువు, ప్రకాశంనగర్‌లో దుకాణాల నిర్మాణానికి డబ్బులు చేతులు మారాయి. అనుమతులకు మంజూరుతో పాటు అదనపు అంతస్తు కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆ పార్టీ నేతలు వసూలు చేశారు.

ఎక్కడెక్కడంటే : ఆర్యాపురం, ఏపీపీఎం ప్రధాన రహదారి, శ్యామలాంబగుడి వద్ద మధ్యవీధి, కోరుకొండ రోడ్డు, ఆజాద్‌ చౌక్, గానుగవీధి, పుంతరోడ్డు, ఎన్టీఆర్‌ కాలనీ, క్వారీమార్కెట్‌ ఎదురు షాపింగ్‌ కాంప్లెక్స్, మల్లికార్జున నగర్, రామాలయం సమీపం, సుబ్బారావుపేట, సాయిబాబాగుడి వీధిలో ఆక్రమణలు ఉన్నాయి. ఆనంద్‌ రీజెన్సీ రోడ్డు, హైటెక్‌ బస్టాండ్‌ వీధి, కంబాలపేట, వినాయక ఆలయం -మోరంపూడి జంక్షన్, వీఎల్‌పురం, జేఎన్‌ రోడ్డు ఇలా అనేకచోట్ల ఆక్రమణమించేశారు. ప్రస్తుతం మదన్‌సింగ్‌ పేట, జాంపేట, మూలగొయ్యి, ఆజాద్‌చౌక్​పై అధికారులు ఫోకస్ పెట్టారు. తొలివిడతలో కాలువలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు.

అన్నింటినీ తొలగిస్తాం : నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే గుర్తించిన ఆక్రమణలను నెలరోజుల్లో తొలగిస్తామని రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ కమిషనర్ కేతన్‌గర్గ్ తెలిపారు. ఇందుకు అంతా సహకరించాలని కోరారు. ఎవరైనా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఘర్షణకు దిగితే కేసుల నమోదుకూ వెనుకాడమని హెచ్చరించారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నామని కేతన్​గర్గ్​ వెల్లడించారు.

Demolition of Houses in Violation of Court Orders : రోడ్ల పక్కన నిర్మాణాలు కూల్చివేత.. కోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులు

నెల్లూరు జిల్లాలో పెట్రేగిపోతున్న భూ ఆక్రమణలపై వైసీపీ కౌన్సిలర్ ఆగ్రహం

Last Updated : Sep 24, 2024, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.