ETV Bharat / state

శ్రీశైలం నీళ్లు అమ్మకం - బడా వాణిజ్య రైతులతో అధికారుల కుమ్మక్కు ! - కేసీ కెనాల్​కు నీటి విడుదల బంద్

Officers Business with Srisailam Reservoir Water: జగన్‌ ప్రభుత్వంలో సహజ వనరులన్నింటినీ దోచుకుంటున్నారు. కొందరు జలవనరులశాఖ అధికారులూ ఇప్పుడు అదే బాట పట్టారు. ప్రస్తుత కరవు కాలంలో నీటిని అమ్మకానికి పెట్టేశారు. శ్రీశైలం జలాశయంలో అంతంతమాత్రంగా ఉన్న నీటితో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. పంటలకు నీళ్లు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కొందరు బడాబాబుల వాణిజ్య పంటలకు నీళ్లు అమ్ముకోవడంతోనే ఇది వివాదంగా మారింది. డిసెంబరు 15 నాటికే కేసీ కాలువ నీళ్లు ఆపేయాలని తీర్మానించినా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని జలవనరులశాఖ అధికారులు, ఒక రాష్ట్రస్థాయి జలవనరులశాఖ ఉన్నతాధికారి కుమ్మక్కై నీళ్లు అమ్మేసుకుంటున్నారు.

Officers_Business_with_Srisailam_Reservoir_Water

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 7:03 AM IST

శ్రీశైలం నీళ్లు అమ్మకం - బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కైన అధికారులు?

Officers Business with Srisailam Reservoir Water : కృష్ణా పరివాహకంలో వర్షాభావ పరిస్థితులు శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత దృష్ట్యా ఈ ఏడాది ఖరీఫ్‌ కాలానికీ సాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు వారబందీ నిర్వహించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో వారం నీరందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్న కొందరు జలవనరులశాఖ అధికారులు రైతుల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటికే మిర్చి సాగుచేసిన బడా రైతులతో కలిసి కొందరు అధికారులు ఈ ప్రణాళిక రచించినట్లు తెలిసింది. ఖరీఫ్‌ (Kharif) పూర్తయ్యాక కాలువలు కట్టేసినా మిర్చికి నీళ్లందించేలా వారితో ఒప్పందం చేసుకున్నారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారికి సన్నిహితులైన స్థానిక అధికారులు ఇద్దరు ఇందుకు పథకరచన చేశారు. ఈ క్రమంలో డిసెంబరు 15న బంద్‌ చేయాల్సిన కేసీ కాలువ ఆ తర్వాత కూడా కొనసాగుతోంది.

Srisailam Reservoir Water in AP : గడివేముల, నంద్యాల, గోస్పాడు, సిరివెల్ల, దోర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో కొన్ని స్లూయిస్‌ల కింద బడా రైతులు మిర్చిసాగు చేపట్టారు. మిర్చి పంటకు ఎకరానికి లక్షన్నర రూపాయల వరకూ ఖర్చవుతోంది. నీళ్లకు కొంత ఖర్చుచేసేందుకూ బడా రైతులు వెనకాడట్లేదు. పైకి ఎమ్మెల్యేల ఒత్తిడి, కుంటలకు నీళ్లని చెబుతున్నా వాస్తవం మాత్రం వేరు.

Low Water Storage in Reservoirs: శ్రీశైలం వెలవెల.. కేసీ కెనాల్​కు నీటి విడుదల బంద్.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన..

కేసీ కాలువ బంద్‌ : కేసీ కాలువ కింద మొత్తం కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో లక్షా 75 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు కింద వర్షాధార, ఆరుతడి పంటలే సాగుచేయాలని 2023 ఆగస్టు 8న నీటిపారుదల సలహామండలి సమావేశంలో తీర్మానించారు. అప్పటికే సాగు చేసిన పంటల్ని కాపాడేందుకు సుంకేశుల, పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కాపాడాలని నిర్ణయించారు. 2023 నవంబరు 25న మరోసారి సమావేశమైన నీటిపారుదల సలహామండలి డిసెంబరు 15 కల్లా కేసీ కాలువ బంద్‌ చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ కేసీ కాలువకు నీళ్లు ఇచ్చారు. ఖరీఫ్‌ కాలం ముగిసినా, కేటాయింపుల మేరకు నీటి విడుదల దాటినా ముందస్తుగా ఇండెంటు, కారణాలు చూపకుండా అనధికారికంగా నీటిని విడుదల చేసేశారు.

ముదిరిన గొడవ : నంద్యాల నియోజకవర్గం పొన్నాపురం స్లూయిస్‌ కింద గతనెల 21 నుంచి 26 వరకు నీళ్లు విడుదల చేశారు. ఈ క్రమంలో నంద్యాల మండలం మిట్నాల మీదుగా గోస్పాడు మండలం తేళ్లపురి గ్రామానికి కేసీ కెనాల్‌ నీళ్లు వెళ్తాయి. మిట్నాల రైతులు నీళ్లు వాడుకుంటుంటే తేళ్లపురి రైతులు గొడవపడ్డారు. డబ్బులు ఇచ్చి తాము నీళ్లు విడుదల చేసుకుంటే మీరే అంతా వాడుకుంటే ఎలాగని ప్రశ్నించారు. గొడవ ముదరడంతో కాల్వకు నీళ్లు ఆపిన అధికారులు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి విడుదల చేశారు.

Low Water Level in Srisailam Reservoir: వెెలవెలబోతున్న శ్రీశైలం జలాశయం.. తీవ్ర ఆవేదనలో రైతులు

డబ్బులు వసూలు చేస్తున్న కేసీ కెనాల్‌ అధికారులు : ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరువెళ్ల మండలం కామినేనిపల్లె, ఆళ్లగడ్డ మండలం చింతకుంట, దొర్నిపాడు మండలంలోని వివిధ గ్రామాల రైతుల నుంచి కేసీ కెనాల్‌ అధికారులు డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికీ కేసీ కెనాల్‌ పరిధిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 16వ లాక్‌ నుంచి 27వ లాక్‌ వరకు నీరు విడుదలవుతోంది. పశువులకు తాగునీరు, నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని కుంటలకు నీళ్లు నింపడం పేరుతో కాల్వలకు నీటి విడుదల జరిగింది. ఇప్పటికీ గడివేముల మండలంలో విడతల వారీగా కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.

Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.