ETV Bharat / state

చదువుపై మమకారం - ఆనందం కోసమే విరాళం: కృష్ణ చివుకుల - Krishna Chivukula Interview - KRISHNA CHIVUKULA INTERVIEW

Krishna Chivukula Interview 2024 : వేల కోట్ల రూపాయలు ఆయన సొంతం. అంతకు మించిన సేవా గుణమూ ఆయన సొత్తే. అన్నదానం, విద్యాదనం, ఆరోగ్య దానం ఒకటేమిటి సాయం చేయడానికి ఎలాంటి అవకాశం ఉన్నా ముందుంటారు. అలా దాతృత్వం గుణం చాటుకుంటూనే చదువుకున్న ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భూరి విరాళం అందించారు. ఆయనే అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు వారు కృష్ణ చివుకుల. దాతల సేవా గుణం వల్లే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగింది అని వివరిస్తూ భారత్‌ను కూడా ఆ స్థాయికి చేర్చాలని అంటున్న కృష్ణ చివుకులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Krishna Chivukula Interview 202
Krishna Chivukula Interview 202 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 9:39 AM IST

  • ప్రశ్న : సార్‌ మీరు అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశంలో విరాళాలు ఇచ్చి విద్యాదానం కావచ్చు, లేదా అన్నదానానికి సంబంధించి సాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది.

జవాబు : నేను పుట్టి పెరిగింది ఈ దేశంలోనే. చిన్నపుడు మాకు డబ్బు ఉండేది కాదు. పేద వాళ్లం కాదు కానీ, పెద్ద ఉన్నవాళ్లం కూడా కాదు. మా ఇంట్లో చదువు ఎక్కువగా ఉంది. దాని వల్ల పైకి వచ్చాం. అలా ఇలా కాదు, చాలా పైకి వచ్చాం. అందులోనూ ఐఐటీలో చదివాను. ఐఐటీ బాంబేలో బీటెక్ చేశాను. ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ చేశాను. ఐఐటీలో నాకు ఉచిత విద్య చదువుకునే అవకాశం వచ్చింది. దాని వల్ల అమెరికాలో ఉపకార వేతనం వచ్చింది. అది కూడా ఉచితం. ఇంత చదువు వల్ల హార్వర్డ్‌లో ఎంబీఏ చదువుకునే అవకాశం వచ్చింది. అది పెద్ద డిగ్రీ. దాన్ని గోల్డన్‌ పాస్‌పోర్ట్‌ అంటారు. దాని వల్ల అమెరికాలో ఉన్నత స్థానానికి ఎదిగాను. ఐనా సరే నా మొదటి ప్రాధాన్యం భారతదేశమే. నేను చదువు వల్ల విజయవంతం అయ్యాను. అందువల్ల నేను వెయ్యి మందికి అవకాశం ఇస్తే అందులో వందమంది నాలాగా తయారై వారు మరో వెయ్యి మందిని తయారు చేసి, వారు మరో కోటి మందిని తయారు చేస్తే దేశం పైకి ఎదుగుతుంది. అమెరికా కూడా అలాగే అయింది కదా.

  • మాతృదేశంలో చదువుకుని ఉన్నత స్థితికి ఎదిగి ఇతర దేశాల్లో స్థిరపడినా స్వదేశం గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాని మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది. మీకు స్ఫూర్తి కల్గించే అంశం ఏమిటి.

జవాబు : అమెరికాలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాల లాంటివి చూస్తే వాటి పేరు పెద్దది. దాని పేరు పెట్టింది జాన్‌ హార్వర్డ్. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పేరు పెట్టింది లీలాండ్‌ స్టాన్‌ఫోర్డ్‌. ఆయన తన కొడుకుకు హార్వర్డ్‌లో ప్రవేశం రాకుంటే సొంత డబ్బుతో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇలాంటివి వంద యూనివర్సిటీలు ఉంటాయి. ఇలా అమెరికాలో డబ్బు సంపాదించిన వారు చాలా మంది పేదవారి కోసం దానాలు ఇచ్చారు. అందుకే అమెరికా బాగా అభివృద్ధి చెందింది. అలాంటి అవకాశం మన వాళ్లకు కూడా ఇవ్వాలి. ఆ విధంగా దానాలు ఇవ్వాలన్న ఆలోచన నాకు అమెరికా నుంచి వచ్చింది.

  • మీరు చెన్నై ఐఐటీకి విరాళం ఇవ్వడమే కాకుండా బెంగళూరులో కూడా ఆరోగ్య సమస్యలకు సాయం చేస్తున్నారు, మధ్యాహ్న భోజన పథకానికి చేయూతనిస్తున్నారు. చదువు అంటే జ్ఞానాన్ని పెంచుతుంది అనుకుంటాం. వైద్యం, అన్నదానానికి సంబంధించి మీకు స్ఫూర్తి ఏమిటి.

జవాబు : ఆరోగ్యం అంటే చాలా ముఖ్యమైనది. పోషకాహాకారం ఉంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. అలా అయితే జ్ఞానం వస్తుంది. ఆకలిగా ఉంటే చదువుకోలేరు. అందువల్ల ఆకలిగా ఉంటే భోజనం పెడదాం అది నా ఆలోచన. ఆ విధంగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. అలా ప్రారంభించి 20 ఏళ్లు అవుతుంది. మా అమ్మ లలితా సహస్రి అనే పేరు మీద దీన్ని ఆరంభించాను.

  • మీరు విద్యాదానం, అన్నదానం, వైద్యదానం చేస్తున్నారు. ఇవే కాకుండా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, ఇతర దాతృత్వ కార్యక్రమ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా.

జవాబు : తప్పకుండా ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌లో ఓ ఉపగ్రహాన్ని రూపొందించాం. దానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మరో ఐదేళ్లు పడుతుంది. ఆ ప్రాజెక్టులో డాటా విశ్లేషణ చేస్తాం. అదంతా ఐఐటీ మద్రాస్‌లోనే అవుతుంది. ఆ ఉపగ్రహం డాటాను విశ్లేషణ చేసిన తర్వాత భూకంపం ఎక్కడ వస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుంది, ఎంత లోతులో ఉంటుంది, ఎంత నష్టం చేస్తుంది అనే విషయాలను చెప్పగలం. ఐతే ఇందుకు ఎక్కడో ఓ చోట ప్రారంభించాలి. అందుకే ముందు అన్నదానం, విద్యాదానం, ఆరోగ్యదానం అనే మూడు కార్యక్రమాలతో మొదలుపెట్టాం. అందులోనూ మా భార్య వైద్యురాలు. వైద్యం అంటే మా భార్యకు కూడా ఇష్టం కాబట్టి మా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

  • మీరు అమెరికాలో స్థిరపడి మాతృదేశం మీద ప్రేమతో పేదలకు విద్యాదానం, వైద్యదానం, అన్నదానం చేస్తున్నారు కదా, ఇదే తరహాలో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి బాగా స్థిరపడిన వారిలో స్ఫూర్తిని నింపి వారు కూడా సేవ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా.

జవాబు : మీరు నాతో మాట్లాడుతున్నారు. అది అమెరికాలో చూస్తారు కదా. అక్కడ తెలుగువారు చాలా మంది ఉన్నారు. నేను చేస్తున్నాను కదా తాము కూడా చేయాలి అని వాళ్లు అనుకుంటారు. అలా ఆ సేవాగుణం పాకుతుంది. అది నాకు కావాలి. ఎక్కడో అక్కడ నిప్పు రాజేయాలి కదా. ఆ నిప్పు వెలుగులో వంద మంది చూస్తారు. ఆ వెలుగు ద్వారా నేను చేస్తున్నానని వారూ చేయాలని భావిస్తారు. అదీ నా ఆలోచన.

  • పూర్వవిద్యార్థిగా మద్రాస్‌ ఐఐటీకి విరాళం అందిస్తున్నారు. కర్ణాటకలో కూడా కొంత సాయం చేస్తున్నారు. మరి ఐఐటీలో చేరాలనుకునే ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల కోసం ఏమైనా సాయం చేసే అవకాశం ఉందా?

జవాబు : ఐఐటీ శిక్షణ కేంద్రాలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. తెలుగువాళ్లు కూడా ఐఐటీల్లో చేరుతున్నారు. మా రోజుల్లో మొత్తం వెయ్యి ఐఐటీ సీట్లకు ఏపీ నుంచి మహాఐతే ఐదారుగురు మాత్రమే ఎంపికయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు చాలా మంది తెలుగువాళ్లు ఐఐటీల్లో చేరుతున్నారు. అమెరికా సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ చాలా మంది తెలుగువాళ్లే ఉన్నారు. కాబట్టి ఐఐటీ శిక్షణ కేంద్రాలపై నాకంత ఆసక్తి లేదు. అది కూడా ఓ విధంగా వ్యాపారమే.

  • ప్రశ్న: అమెరికాతో పాటు ఇండియాలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు కదా. ఇప్పుడు మీరు పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా?

జవాబు : ప్రస్తుతం నేను ఒక వినూత్న టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నాను. మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఆ సాంకేతికను జర్మనీలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లే అభివృద్ధి చేశారు. దానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాను. దానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. తిరుపతిలో కూడా పెద్ద తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వందల మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన వాటిని మరో రెండేళ్లలో వెయ్యి కోట్లతో విస్తరిస్తాము. ఐదేళ్లలో ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా పెట్టుబడులు పెడతాం.

  • మీ జీవితంలో ఎదురైన అడ్డంకులు, సంతోషం పంచిన అంశాలు ఏమైనా ఉన్నాయా.?

జవాబు : హార్వర్డ్‌కి వెళ్లినప్పుడు నా దగ్గర డబ్బు లేదు. అక్కడ రుణాలు తీసుకొని చదువుకున్నాను. అప్పుడు తినడానికి కూడా డబ్బు ఉండేది కాదు. అప్పుడు సంపన్నులను చూసి నేను కూడా అలా అవ్వాలని అనుకునేవాడిని. కానీ లేని దాని కోసం ఆరాటపడేవాడిని కాదు.

  • 37 ఏళ్ల వయసులో అమెరికాలోని ప్రముఖ కంపెనీ సీఈవోగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

జవాబు : 1984లో అమెరికాలో చర్మం రంగు నలుపు, తెలుపు ఆధారంగా వివక్ష ఉండేది. దాంతో భారతీయులు రాణించేవారు కాదు. ఐనా భారతీయుల్లో సీఈవో అయిన వారిలో నేను ఒకడిని. 1989లో బాస్‌కి నాకు పడలేదు. కారణం చర్మం రంగు. ఆ కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత విద్యార్హతలను బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అప్పుడే కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు కెమిస్ట్రీలో కొత్త సాంకేతికత స్టార్ట్‌ చేశాను. అది ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. కాలిఫోర్నియాలో ఒకటి, న్యూయార్క్‌లో ఒకటి, ఫ్రాన్స్‌లో ఒకటి మొత్తంగా 3 కంపెనీలు 2006లో అమ్మేశాను. 1995లో ఇండియాకి వచ్చాను. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నా కంపెనీల్లోని ఇంజినీర్లంతా భారతీయులే. వాళ్లకి ఆనాడే చెప్పాను మన కంపెనీ ప్రపంచంలో నంబర్‌ 1 చేయాలని. ఆ విధంగా అందరూ ప్రయత్నించారు. ఇండో ఎంఐఎం కంపెనీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతోంది. 5000ల నుంచి 6000ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

  • అమెరికాలో స్థిరపడిన, పెట్టుబడిదారులైన భారతీయులకు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తారు.

జవాబు : భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా నుంచి వచ్చే వారు ఇక్కడి అవినీతికి విధానానికి భయపడతారు. కానీ, దానిని ఎదుర్కోవాలి. దానికి ఓపికగా ప్రయత్నించాలి. మనపై మనకు ధీమా ఉండాలి. వారికి కూడా నమ్మకం కలిగించాలి. అప్పుడు వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. వీటన్నింటిని దాటుకునే నేను ఈ స్థాయికి వచ్చాను. మా కంపెనీలో పైస్థాయి అధికారులంతా భారతీయులే.

  • మద్రాస్‌ ఐఐటీకి, బెంగుళూరులోని ఆసుపత్రికి, అన్నదానానికి విరాళాలు ఇచ్చారు. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏదైనా విద్యాలయం, ఆసుపత్రులను దత్తత తీసుకొని సేవాకార్యక్రమాలు చేసే ఆలోచనలో ఉన్నారా?

జవాబు : అవును. ఆ విధంగా నాకు కుడా ఆలోచన ఉంది. నేనెక్కడుంటే అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తాను. మా ఆవిడది కర్ణాటక కాబట్టి అక్కడ చేశాను. నేను తెలుగు వ్యక్తిని కాబట్టి ఆంధ్రాలోనూ సేవాకార్యక్రమాలు చేస్తాను. తిరుపతిలో సేవాకార్యక్రమాలు మొదలుపెడతాం. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తాం.

ఆనందం, ఆరోగ్యంగా ఉండాలనే రూ. 228 కోట్ల విరాళం: కృష్ణ చివుకుల - 228 crore donation to IIT Madras

మాతృభూమిని మరవని బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల - ఐఐటీ మద్రాసుకు​ భారీ విరాళం - NRI Huge Donation to IIT Madras

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.