NRI Bodduluri Yashasvi Attended CID Inquiry in Guntur: గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎన్‌ఆర్‌ఐ బొద్దులూరి యశస్వి మరోసారి హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్23వ శంషాబాద్ విమానాశ్రయంలో యశస్విని అదుపులోకి తీసుకొని లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు తీసుకువచ్చారు. సామజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే అభియోగం మీద 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. అధికారుల ఆదేశాల మేరకు 2024 జనవరి 11న తిరుపతి సీఐడీ కార్యాలయంలో విచారణకు యశస్వి హాజరయ్యారు. తాాజాగా నేడు న్యాయవాదితో కలిసి మరోసారి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు.
బొద్దులూరి యశస్వి సీఐడీ విచారణ పూర్తయ్యింది. మళ్లీ ఫిబ్రవరి 2న విజయవాడ సీఐడీ ఆఫీసుకు రావాలని అధికారులు చెప్పినట్లు తెలిపారు. అధికారులు అడిగిన 32 ప్రశ్నలకు సమాధానం చెప్పానని కొన్ని వీడియోలు చూపించి వాటి గురించీ అడిగారన్నారు. తిరుపతి నుంచి కూడా అధికారులు వచ్చి విచారించినట్లు యశస్వి తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో సంతకాలు సేకరించారని వెల్లడించారు. సీఐడీ కార్యాలయంలో యశస్వికి తెలుగు యువత ఆయనకు భోజన ఏర్పాట్లు చేయగా పోలీసులు అనుమతించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు పోలీసులతో తెలుగు యువత నాయకులు వాగ్వాదానికి దిగారు. సీఐడీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోకపోతే అట్రాసిటీ కేసులు పెడతామని పోలీసులు బెదిరించినట్లు తెలుగు యువత నాయకులు తెలిపారు.
6 గంటల విచారణ తర్వాత సాఫ్ట్వేర్ రామును వదిలిపెట్టిన సీఐడీ - 28న రావాలని నోటీసులు
ఇదీ జరిగింది: సామాజిక మాధ్యమాల్లో యష్‌గా సుపరిచితుడైన ఎన్‌ఆర్‌ఐ బొద్దులూరి యశస్వి ని హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పారు. తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. అనంతరం యశస్విని అదుపులోకి తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి 41ఏ సీఆర్పీసీ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. 2024 జనవరి 11న తిరుపతి సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కఠిన చర్యలు - సీఎంపై పోస్టులు పెట్టేవారిపై నిఘా : సీఐడీ
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు యశస్విపై కేసు నమోదు చేశారు. వృత్తి రీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు. పోలీసుల చర్యను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు. చివరి వంద రోజుల్లోనైనా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమో అని భావించిన ప్రవాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ జగన్ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని కొనసాగిస్తోందని విమర్శించారు. యష్‌ను అక్రమంగా అదుపులోని తీసుకోవడాన్ని అమెరికాలోని ఎన్నారైలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు.