ETV Bharat / state

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు - POLICE ISSUE NOTICE TO SAJJALA

వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు - టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జలకు నోటీసులు పంపిన పోలీసులు - గురువారం ఉదయం 10.30 గం.కు విచారణకు రావాలని నోటీసులు

YCP LEADER SAJJALA RAMAKRISHNAREDDY
Notice to YCP Leader Sajjala Ramakrishna Reddy : (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 12:41 PM IST

Updated : Oct 16, 2024, 2:10 PM IST

Notice to YCP Leader Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశాయి. దీనిపై తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురాంను ఫలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు కొందరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దాడి కుట్రలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు భయంతో సజ్జల ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ ఉత్తర్వులు విచారణకు అవరోధం కాదని పోలీసులు స్పష్టం చేశారు. సజ్జల విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సజ్జలను అడ్డుకోవడంతో లుక్‌అవుట్‌ నోటీసుల అంశంపై వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే సగానికిపైగా విచారణ పూర్తి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించినప్పటికీ ఇప్పటికే సగానికి పైగా విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసులతో కలిసి తదుపరి విచారణను ముందుకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ కేేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ నిందితుడిగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృత్తం అయ్యాయని వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని పోలీసు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అప్పటి వరకు ఆయన ఈ కేసులో 120వ నిందితుడేనని పోలీసులు స్ఫష్టం చేశారు.

'సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు'

కౌంటింగ్​ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు - సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు - Case Filed On Sajjala Ramakrishna

Last Updated : Oct 16, 2024, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.