ETV Bharat / state

జగన్‌ చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! - NO SAFETY FOR ENDOWMENT LANDS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 10:07 AM IST

NO SAFETY FOR ENDOWMENT LANDS: కష్టమొస్తే దేవుడా నువ్వే దిక్కంటాం! అలాంటిది జగన్‌ తెచ్చిన కొత్త చట్టంతో ఆ దేవుడికే కష్టమొచ్చ పరిస్థితి వచ్చింది. అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. తమకు సాగిలపడే అధికారులను ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారులుగా నియమించుకొని నొక్కేసే అవకాశం ఉంది.

NO SAFETY FOR ENDOWMENT LANDS
NO SAFETY FOR ENDOWMENT LANDS (ETV Bharat)

NO SAFETY FOR ENDOWMENT LANDS: జగన్‌ ప్రభుత్వంలో దేవుడి మాన్యాలు ప్రమాదంలో పడుతున్నాయి. భూ ఆక్రమణదారులకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రాచబాట పరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాలు, సత్రాలు, వివిధ ధార్మిక సంస్థలకు చెందిన భూములు 4 లక్షల 70వేల ఎకరాల వరకు ఉన్నాయి. వాటిలో దాదాపు లక్ష ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై వివిధ కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి.

అయితే జగన్‌ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం పుణ్యమా అని భవిష్యత్తులో దేవాదాయ శాఖ భూములు మిగులుతాయా? హారతి కర్పూరంలా కరిగిపోతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారనుంది. ఇది వరకు దేవాదాయ శాఖ భూములు నిషేధిత జాబితాలో ఉంటే.. వాటిని ఎవరూ తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇతరుల భూములు ఏవైనా అందులో చేరి ఉంటే, దానికి సంబంధించిన రికార్డులను ఆధారాలతో సహా చూపించాలి. ఆలయ ఈవో మొదలుకొని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల వరకు అందరూ సమగ్రంగా పరిశీలించాక గానీ ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఎన్​ఓసీ జారీ చేయరు.

వైఎస్సార్సీపీ నాయకుల దందా స్టైలే అంతా - ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​పై సోషల్​ మీడియాలో ట్రోల్స్​ - Land Titling Act Trolls

స్థలంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే: ప్రతి ఆలయానికి ఆస్తుల రిజిస్టర్‌ ఉంటుంది. అందులో ఆ ఆలయానికి సంబంధించిన భూముల వివరాలన్నీ సర్వే నంబర్లతో సహా ఉంటాయి. ఆ సర్వే నంబర్లలోని భూమిని ఇతరులు దక్కించుకోవడం అసాధ్యంగా ఉండేది. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో ఆ దేవుడి భూములకే చిక్కొచ్చిపడింది. ఆలయ భూముల వివరాలు ఏ లిస్ట్​లో, ఏ రిజిస్టర్‌లో నమోదై ఉన్నా, పరుల పాలయ్యే అవకాశముంది.

ఏదైనా ఆలయానికి చెందిన భూమి తనదంటూ ఎవరైనా తప్పుడు పత్రాలతో ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (TRO) వద్ద క్లైమ్‌ చేసుకుంటే ఆ స్థలంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఆ క్లైయిమ్‌ను సంబంధిత ఆలయ అధికారి పట్టించుకోకుండా రెండేళ్లపాటు మౌనం వహిస్తే, చివరకు ఆ వ్యక్తికే ఆ భూమి చెందుతుందంటూ కన్‌క్లూజివ్‌ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. ఇప్పటికే దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు.. ఆలయాలు, మఠాలు, సత్రాలకు చెందిన భూములకు ఎన్వోసీలు ఇవ్వడానికి, వాటిని ఇతరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

3 రూపాల్లో ముప్పు - టైటిలింగ్‌ చట్టంతో భూమి కోల్పోయే ప్రమాదం - Land Titling Act 2022

భూముల ఆక్రమణదారులకు వరం: అన్నమయ్య జిల్లా పట్టెంవాడపల్లెలోని వ్యాసరాయ మఠానికి చెందిన 727 ఎకరాలకు ఎన్​ఓసీ జారీ చేయాలంటూ వైసీపీ నేత ద్వారా అధికారులకు అర్జీ పెట్టించారు. నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించేలా చూడాలంటూ వైసీపీలో నం.2 స్థానంలో ఉండే పెద్దాయన దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన రాయలసీమ ప్రాంతీయ దేవాదాయ శాఖ అధికారి.. కర్ణాటకకు చెందిన మఠానికి సంబంధించిన ఆ భూములకు ఎన్​ఓసీ ఇవ్వొచ్చని నివేదిక సమర్పించారు.

తిరుపతిలోని హథీరామ్‌జీ మఠానికి చెందిన వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. సీఎం జగన్‌ అంటే చెవి కోసుకునేంతటి వినయాన్ని ప్రదర్శించే వైసీపీ నేత, అతని సోదరుడి నేతృత్వంలో పెద్దఎత్తున ఆక్రమణలు జరిగాయి. ఇప్పుడు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. ఆ మఠం భూముల ఆక్రమణదారులకు వరం అయ్యే అవకాశముంది. తిరుపతిలోని గాలిగోపురం మఠానికి చెందిన భూముల విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

'ఆస్తి హక్కును హరించే చట్టమిది'- ల్యాండ్‌ టైటిలింగ్​తో ఎవరికి మేలో చెప్పండి జగనన్న! - Lawyers Comments on Land Titling

వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదం: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 వేల ఎకరాల భూములు వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 13 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రైబ్యునల్, కోర్టుల ఎదుట దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 2019 నాటికి వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో 2 వేల కేసులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 5 వేలకు చేరినట్టు ముస్లిం సంఘాలు చెబుతున్నాయి. కొత్త చట్టం అమలులోకి వస్తే ప్రస్తుతం మిగిలిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కూడా కబ్జాకు గురయ్యే ప్రమాదముంది. క్రైస్తవ మిషనరీ సంస్థలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి వీటిపై కన్నేసినవారు ఆ ఆస్తులను సొంతం చేసుకోవడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అవకాశం కల్పిస్తుంది.

దేవాదాయ, వక్ఫ్‌ భూములు వివరాలు అన్నీ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటిని డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లోకి చేర్చేందుకు కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమి తమదంటూ ఎవరైనా వస్తే, దానికి సంబంధిత అధికారి అభ్యంతరం చెప్పినా కూడా దానిని డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లోకి చేర్చే విచక్షణాధికారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి ఉంటుంది. ఇలా ఒకసారి డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లోకి చేరిన భూమికి చెందిన వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందనేది ఆ దేవుడికి కూడా తెలిసే అవకాశం ఉండదు!

భూములను మింగేసే కొత్త వైరస్!- Bro ఈ Tro ఏమిటి? - Land virus in AP

జగన్‌ కొత్త చట్టంతో దేవుడి భూములూ గోవిందా - ఆక్రమిస్తే ఆ పైవాడూ కాపాడలేడు! (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.