ETV Bharat / state

హైదరాబాద్​లో న్యూఇయర్​ వేడుకలు - అద్దిరిపోయే ఈవెంట్స్​ - NEW YEAR CELEBRATIONS IN HYD

అదిరిపోయే ఈవెంట్లతో న్యూయర్​ వేడుకలు - నయా పార్టీ థీమ్స్​తో స్పెషల్​ ఆఫర్స్​

new_year_events_in_hyderabad
new_year_events_in_hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 7:25 PM IST

New Year Events In Hyderabad : హైదరాబాద్​లో కొత్త సంవత్సర వేడుకల తీరే వేరు. ప్రతీ సంవత్సరం కొత్త థీమ్‌లతో నిర్వాహకులు ఈవెంట్​లను చేస్తారు. ఫేమస్​ సింగపర్స్​తో, సినీ తారలతో, గ్లామరస్​ కార్యక్రమాలతో జనాలను ఉర్రూతలూగిస్తారు.ఈ వేడుకల్లో సంగీతమే ప్రధానం కావడంతో డీజేలు కేంద్రంగానే పార్టీలను డిజైన్‌ చేస్తారు. ఈ పార్టీల్లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు కుర్రకారు స్నేహితులతో కలిసి వస్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు ఈవెంట్​ మేనేజర్లు​ పేరున్న డీజేలను నగరానికి రప్పిస్తున్నారు. ఈవెంట్ల సంఖ్య కూడా గతం కంటే ఈసారి పెరిగింది.

న్యూ ఇయర్​ పార్టీ ఉంది పుష్పా : 31 వేడుకలకు, 2025లోకి అడుగు పెట్టేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏడాదిలో అందరూ కలిసి జరుపుకొనే వేడుక రానే వచ్చింది. 2024కి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు పార్టీ ఎక్కడ పుష్పా అంటూ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు బుక్‌ చేసుకున్నారు. పార్కులు, క్లబ్‌లు, పబ్‌లు, స్టార్‌ హోటల్స్, శివార్లలోని కన్వెన్షన్ హాళ్లు వేడుకలకు ముస్తాబయ్యాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలతో సందడి చేసేందుకు అసోసియేషన్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

న్యూ ఇయర్ 2025​ వేడుకలకు వేళైంది - కానీ షరతులున్నాయి

దేశంలోనే నంబర్​వన్​ రామోజీ ఫిల్మ్‌సిటీలో : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో 31న రాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోనే నంబర్‌వన్‌ డీజే చేతస్‌ లైవ్‌ మ్యూజిక్ షో ఉంటుంది. దాంతో పాటు స్టాండప్‌ కామెడీ, అక్రోబాటిక్‌ స్టంట్స్, గేమ్స్‌ ఉన్నాయి. వేడుకలు ముగిసిన తర్వాత ఎల్బీనగర్‌ వరకు రవాణా సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

నోవాటెల్‌లో న్యూఈయర్‌ ఈవెంట్‌ : నయాసాల్‌ పార్టీలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో నిర్వహిస్తుంటారు. విద్యుత్తు ధగధగల నడుమ, లైవ్‌ మ్యూజిక్, డీజేల సంగీత హోరులో వేడుకల నిర్వహణ మొదలు ఇండోర్‌లో పార్టీల వరకు వేర్వేరు థీమ్‌లతో ముందుకొస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, ఈడీఎం, రాక్‌ మ్యూజిక్‌తో అలరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్యాన్స్‌ ఫ్లోర్లు, ఓపెన్‌ ఎరీనాలో వేడుకలకు కుర్రకారు ఉత్సాహం చూపిస్తున్నారు. లైవ్‌ మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యాలతో హోరెత్తించనున్నారు. వేడుకలకు మంచి స్పందన ఉందని నోవాటెల్‌లో న్యూఈయర్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్న ఆల్వేస్‌ ఈవెంట్స్‌ యజమాని సంపత్‌ తెలిపారు.

న్యూఇయర్​ వేడుకలకు ఫిల్మ్​సిటీ స్వాగతం - ఇక సందడే సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.