ETV Bharat / state

వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్‌ కార్డు - త్వరలోనే అమలు - New Ration Cards in AP - NEW RATION CARDS IN AP

New Ration Card Issuing in AP: ఏపీలో ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రేషన్‌ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్‌ కార్డు ఇచ్చే విధానాన్ని అమలు చేయనుంది. మరోవైపు జగన్‌ బొమ్మ తొలగించి, మళ్లీ కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

New Ration Card Issuing in AP
New Ration Card Issuing in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 9:01 AM IST

Updated : Aug 11, 2024, 9:19 AM IST

New Ration Card Issuing in AP : ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుల్నీ వదలకుండా జగన్‌ బొమ్మ ముద్రించింది. పార్టీ రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి సర్కార్‌ నిర్ణయించింది. వైఎస్సార్సీపీ హయాంలో రేషన్‌ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.

How To Apply New Ration Card in Telugu : రాష్ట్రంలో ప్రస్తుతం కోటీ 48 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా వాటిలో 89 లక్షలకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది.

రేషన్​ కార్డు ఉన్నోళ్లందరికీ అద్భుత అవకాశం - మిస్​ అయితే తీవ్రంగా నష్టపోతారు! - Corrections In Food Security Card

వైఎస్సార్సీ ప్రభుత్వం కొత్త కార్డులకు కోత : దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని 2020లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు రెండున్నర గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని చెప్పింది. అయితే కార్డుల సంఖ్య పెరిగితే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ సర్కారు గత ఐదేళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టింది.

కొత్త జంటకు రేషన్‌ కార్డు జారీ : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో కోటీ 47 లక్షల 33 వేల 44 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టుకి వాటి సంఖ్య కోటీ 48 లక్షల 43 వేల 671కి చేరింది. అంటే గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు లక్షా 10 వేలు మాత్రమే. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్‌ కార్డు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

రేషన్​కార్డు ఆశావహులకు గుడ్​న్యూస్ - విధివిధానాలపై నేడు కేబినెట్ భేటీ - TELANGANA CABINET MEETING TODAY

రేషన్​కార్డుదారులకు అలర్ట్​ - ఆ తేదీలోపు ఈ పని చేయకపోతే సరుకులు కట్​! - Ration Card e KYC Last Date

Last Updated : Aug 11, 2024, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.