TDR Bonds New Guidelines in Andhra Pradesh : మాస్టర్ ప్లాన్ రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇస్తున్న బదిలీకి వీలున్న హక్కు పత్రాల్లో ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం (NDA Alliance Government) ముకుతాడు వేసేందుకు సిద్ధమవుతోంది. జగన్ మోహన్ రెడ్డి పాలన (Jagan Mohan Reddy Ruling)లో టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 6 రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం : గత ఐదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బాండ్లు ఇచ్చారు. ఇందులో వైఎస్సార్సీపీ నేతలకు భారీగా కమీషన్లు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే బాండ్ల జారీలో అవినీతికి ఆస్కారం లేని ఉత్తమ విధానాలపై అధికారులు దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, హరియాణాలలో అధ్యయనం చేస్తున్నారు.
టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - సీఐడీ దర్యాప్తునకు యోచన - TDR Bonds Scam in AP
ఇతర రాష్ట్రాల్లోని విధానాల పరిశీలనకు పురపాలక కమిషనర్ హరి నారాయణన్ ఛైర్మన్‌గా పట్టణ ప్రణాళిక విభాగం ఉప సంచాలకులు మక్బూల్ అహ్మద్ కన్వీనర్‌గా ఏడుగురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని మొదట నిర్ణయించినా మరో రెండు, మూడు రాష్ట్రాలను అదనంగా చేర్చి పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రభుత్వానికి నెలఖారులోగా అధికారులు నివేదిక అందించనున్నారు.
టీడీఆర్ కుంభకోణంలో జగన్ తప్పకుండా అరెస్టు అవుతారు: బుద్దా వెంకన్న - Buddha Comments on Jagan
అక్రమ వసూళ్లకు వేదికగా విధానం : ఆన్‌లైన్ కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రాష్ట్రంలో విధిగా అమలు చేయనున్నారు. దీనిలో పారదర్శకత కోసం ఐటీ సేవలను అనుసంధానించాలని భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆన్‌లైన్ విధానాన్ని అక్రమ వసూళ్లకు వేదికగా మార్చేశారు. కొత్త నిర్మాణాలకు ముడుపులు తప్పనిసరి చేశారు. అనేక చోట్ల వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు కుమ్మక్కయ్యారు. అనుమతులను సరళీకృతం చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ సమూల మార్పులు చేయనున్నారు. పరిపాలన వ్యవహారాల నుంచి ఆదాయ సమీకరణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ వరకు కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నారు.
టీడీఆర్ బాండ్లలో అక్రమాలు - నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి నారాయణ - Minister Narayana on TDR Bonds