ETV Bharat / state

ఈ పరికరంతో సముద్రంలో ప్రమాదాలను పసిగట్టొచ్చు - మత్స్యకారులకు సరైన ఆయుధం - FREE TRANSPONDER TO FISHERMEN

ట్రాన్స్‌పాండర్‌ సముద్ర జలాల్లో దిక్సూచిగా పని చేస్తుంది- ఇది సముద్రంలోని ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి మత్య్సకారులను అప్రమత్తం చేస్తుంది.

nda_govt_providing_free_transponder
nda_govt_providing_free_transponder (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 12:53 PM IST

NDA Govt Providing Free Transponder to Fishermen by PMMSY Scheme : సముద్రపు అలలకు ఎదురెళ్లి, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులకు ఎదురీది మత్స్యకారులు కడలిలో వేట సాగిస్తారు. కొన్ని సమయాల్లో ప్రకృతి విపత్తులు, తుపాన్ల వల్ల దారి తెలియక ఇతర దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇకపై వీరికి ఈ తిప్పలు తప్పనున్నాయి.

సమాచారం తెలిపేలా : 'ట్రాన్స్‌పాండర్‌' ఇది మత్స్యకారులకు సముద్ర జలాల్లో దిక్సూచిగా పని చేసే పరికరం. దీనిని గతంలో సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు 40 శాతం రాయితీపై అందించేవారు. గత అయిదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వీటి ఊసే లేకుండా పోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) పథకం కింద ఉచితంగా వీటిని మత్య్సకారులకు అందిస్తోంది. ఇందులో రెండు పరికరాలు ఉంటాయి. ఒకటి బోటుకు, మరో భాగాన్ని డ్రైవర్‌ వద్ద ఏర్పాటు అమర్చుతారు. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది.

నడిసంద్రంలో మత్స్యకారులకు తోడుగా ఇస్రో పరికరం - Transponders on fishermen boats

ట్రాన్స్‌పాండర్‌ ప్రయోజనాలు

  • తుపాన్లు, వాయుగుండం ఏర్పడినపుడు ముందస్తుగా వాటి సమాచారం తెలియజేసుంది.
  • పొరుగు దేశాల సరిహద్దులోకి వెళ్తుంటే సంకేతాలు వస్తాయి.
  • అనుకోని ప్రమాదం ఎదురైతే డ్రైవర్‌ వద్ద అమర్చిన పరికరంపై ఎస్‌ఓఎస్‌ మీట నొక్కగానే సమీపంలోని కోస్టుగార్డు కార్యాలయానికి సమాచారం చేరుతుంది. వారు స్పందించి సహాయం అందించే అవకాశం కలుగుతుంది
  • సముద్రంలో ప్రమాదం జరిగితే శాటిలైట్‌ ద్వారా కోస్టుగార్డు, మత్స్యశాఖ కార్యాలయం, బోటు యజమానికి సమాచారం వెళ్తుంది.

తూర్పు గోదావరి జిల్లాలో 93 కి.మీ. మేర తీరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 7 బోట్‌ ల్యాడింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా వందల బోట్లు సముద్రంలోకి వేటకు వెళ్తున్నాయి. వీటిలో సోనాబోట్లు(మెకనైజ్డ్‌) 62 ఉన్నాయి. మిగిలినవి మోటారు బోట్లు. మెకనైజ్డ్‌ బోట్లపై వేటకు వెళ్లే వారు సుమారు 10 రోజుల వరకు సముద్రంలోనే ఉండి వేట సాగిస్తారు.

61 బోట్లకు అమర్చాం : మొదటి విడతలో తూర్పుగోదావరి జిల్లాకు 62 పరికరాలు మంజూరయ్యాయి. వీటిని బోట్లకు అమర్చే ప్రక్రియ పూర్తి చేశామని, రెండో విడతలో సుమారు 1850 పరికరాలు అవసరమని మత్యకారులు అధికారులకు తెలిపామన్నారు. అవీ త్వరలోనే అందనున్నాయి జిల్లా మత్స్యశాఖ అధికారి పేర్కొన్నారు. వాటిని సముద్రంలో వేటకు వెళ్లే అన్ని బోట్లకు అమరుస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల తుపాన్ల సమయంలో మత్స్యకారులు ఆచూకీ సులభంగా తెలుస్తుందని వివరించారు.
అంధకారంలో మత్స్యకారుల జీవితాలు - ఆశలన్నీ కూటమి ప్రభుత్వపైనే! - Fishermen Faced Problem

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.