ETV Bharat / state

అంకుడు కర్రలకు లైన్​ క్లియర్​ - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం

ఏటికొప్పాకకు ఆపన్న హస్తం - ఉపాధి హామీలో అంకుడు పెంపకం

NDA_GOVT_FOCUS_ON_ETIKOPPAKA_DOLLS
NDA_GOVT_FOCUS_ON_ETIKOPPAKA_DOLLS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

NDA Govt Focus On Etikoppaka Dolls in AP : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక హస్తకళ మరింత వెలుగులీనేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బొమ్మల తయారీలో అత్యంత కీలకమైన అంకుడు కర్ర, తెల్లపొణి చెట్లు తగ్గిపోవడంతో కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ముడి సరకు కొరత రాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో అంకుడు కర్ర, తెల్లపొణిక చెట్లు పెంచాలని అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రెండు, మూడు తరాలకు సరిపడా చెట్లు పెంచాలనే ప్రణాళిక తయారు చేసి తక్షణం అమలు చేయాలని అధికారులకు సూచించింది. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో 5 వేల ఎకరాల్లో అంకుడు కర్ర మొక్కలు పెంచాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

ఈ చెట్టు బంగారం - ఒక్కటి ఉన్నా చాలు కాసుల పంటే

అంకుడు మొక్క ఇదే : తిలక్కబొమ్మల తయారీలో ఏటికొప్పాక జాతీయ స్థాయిలో జీఐ ట్యాగ్​ గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 250 కుటుంబాలకు చెందిన 500 మంది కళాకారులు ఈ బొమ్మలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో మహిళలు 160 మందికి పైగా ఉన్నారు. రెండు శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఏటికొప్పాక కళాకారులకు ఉంది. లక్క బొమ్మల తయారీకి సున్నితమైన అంకుడు కర్రను వినియోగిస్తారు. గతంలో అంకుడు కర్ర కళాకారులకు పుష్కలంగా దొరికేది.

విపరీతంగా చెట్ల నరికివేత కారణంగా ఇప్పుడు ఈ కర్ర కొరత ఏర్పడింది. కూలీలు అడవుల్లోకి వెళ్లి చాలా దూరం నుంచి ఈ కర్రను మోసుకురావాల్సి వస్తోంది. దీంతో కళాకారులకు అదనపు ఖర్చు పెరిగిపోయింది. గతంలో మోపు (10 కర్రల కట్ట) రూ. 1000కి లభించేది. ఇప్పుడు మోపు ధర రూ.2500 లకు పెరిగింది. అంత ధర వెచ్చించినా బొమ్మల తయారీకి సరిపడా లావు కర్ర దొరకడం లేదు. కలప వ్యయం పెరిగిన కారణంగా బొమ్మ తయారీ ఖర్చు 3 రెట్లు పెరిగింది. దీంతో బొమ్మల అమ్మకాలు తగ్గిపోవడంతో కళాకారులు లాభాలు తగ్గించుకోవాల్సి వస్తోంది.

"ఆ నిద్రగన్నేరు మళ్లీ చిగురించింది - ఆకు తొడిగిన సినిమా చెట్టు"

అంకుడు కర్రపై అటవీశాఖ నిషేధం తొలగించాలని కళాకారులు చాలా కాలం నుంచే కోరుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటికొప్పాకలో నదిగట్ల పక్కన, స్థానిక చక్కెర కర్మాగారం వెనుక ఉన్న కొండల పైన అంకుడు కర్ర, తెల్లపొణి మొక్కలు నాటించారు. తరవాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవ చూపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, అటవీ భూములతో పాటు రైతుల భూముల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంకుడు చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

మూడేళ్లలో కోతకు : అంకుడు కర్ర మొక్క నాటిన 3 సంవత్సరాలకే కోతకు వస్తుంది. వాటి కొమ్మలు నరికి చెట్టు అలా ఉంచితే మళ్లీ చిగురిస్తుంది. అంకుడు కర్ర మొక్కలు విస్తారంగా పెంచి ప్రభుత్వమే తక్కువ ధరలకు కళాకారులకు అందిస్తే ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ కొంత మందికి ఉపాధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ఏటికొప్పాక కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ చుట్టు పక్కల గ్రామాల్లో 1500 మందికి పైగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరితో ప్రభుత్వ స్థలాల్లో అంకుడు కర్ర మొక్కలు నాటించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంత విస్తీర్ణంలో పెంచాలన్నది నిర్ణయిస్తాం. రైతుల పొలాల్లో అంకుడు మొక్కలు పెంచడానికి వారు అంగీకరిస్తే తమ భూముల్లోనూ పెంచుతాం. పక్వానికి వచ్చాక ఆ రైతులే కర్రను అమ్ముకుంటారు. - శ్రీ శైలపు చిన్నయాచారి, జాతీయ అవార్డు గ్రహీత, ఏటికొప్పాక

150 ఏళ్ల వయసు - 300 సినిమాలు​ - నేలకూలిన భారీ వృక్షం - Cinema tree Fallen down

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.