ETV Bharat / state

మండుటెండల్లోనూ జోరుగా కూటమి అభ్యర్థుల ప్రచారం- అడుగడుగునా జన నీరాజనం - NDA Alliance Election Campaign - NDA ALLIANCE ELECTION CAMPAIGN

NDA Alliance Election Campaign in Andhra Pradesh : మండుటెండలను లెక్కపెట్టక రాష్ట్రంలో కూటమి పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఓట్ల అభ్యర్థనకు వెళ్లిన నేతలకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్-6 పథకాలను వివరిస్తున్నారు. కూటమి మేనిఫెస్టోకు ఆకర్షితులైన వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

nda_alliance_election_campaign_in_andhra_pradesh
nda_alliance_election_campaign_in_andhra_pradesh (ఈటీవీ భారత్​ ప్రత్యేకం)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:12 PM IST

NDA Alliance Election Campaign in Andhra Pradesh : మండుటెండలను లెక్కపెట్టక రాష్ట్రంలో అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఓట్ల అభ్యర్థనకు వెళ్లిన నేతలకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్-6 పథకాలను వివరిస్తున్నారు. కూటమి మేనిఫెస్టోకు ఆకర్షితులైన వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.

వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 17వ వార్డు కౌన్సిలర్ సరితా, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డిలు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలనలో మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే టీడీపీలో చేరారని తెలిపారు.

అందరికీ మేలు చేసేలా కూటమి మ్యానిఫెస్టో - బంగారు భవితకు బాటలు వేస్తాం: పవన్‌ - Pawan Kalyan election campaign

అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 4, 5వ డివిజన్లల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ కూటమి మేనిఫెస్టో అంశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్ దారులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ , మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగి సూపర్-6పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని గ్రామాల్లో యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో యార్లగడ్డతో పాటు నందమూరి రామకృష్ణ, మాజీ ఎంపీ కొనకళ్ల మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన పాల్గొన్నారు. కూటమి మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు.

'జగన్‌ ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి'-జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - Alliance Candidates campaign

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం, నరసింహారావు పాలెంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీలు, కర్పూర హారతితో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమిదే విజయమని చెబుతున్నాయని తెలిపారు. NDA ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

విజయవాడలో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు . ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటే, తప్పక కాంగ్రెస్ పార్టీ నే తప్పక గెలిపించాలని, విజయవాడ ఎంపీ గా పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్ ఓటర్లకు తెలిపారు.

ఫుల్ జోష్​​లో కూటమి అభ్యర్థులు - ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తు ప్రచారం - NDA LEADERS ELECTION CAMPAIGN

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.