NMC issues unique IDs to all doctors in India: దేశంలోని వైద్యులందరికీ జాతీయ వైద్య కమిషన్(National Medical Commission) యూనిక్ ఐడీ నంబరు జారీ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వైద్య మండళ్లు జారీచేసే రిజిస్ట్రేషన్ నంబరుకు ఇది అదనంగా ఉంటుంది. దీనివల్ల వైద్యులకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తున్నాయి. వారు ఎక్కడ చదివారు? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? వారి అర్హత సర్టిఫికెట్లు నిజమైనవా కాదా అనే వివరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
వైద్యుల వివరాలను వెబ్‌సైట్‌లో చూసే అవకాశమూ ఉంది. దేశం మొత్తం మీద 13.08లక్షల మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో 2016 నుంచి ప్రైమరీ సభ్యత్వం పొందినవారు 39,249 మంది, రెన్యువల్స్ పొందిన వారు 36,694 మంది ఉన్నారు. ఇప్పటివరకు నేషనల్ మెడికల్ రిజిస్టర్‌లో రాష్ట్రం నుంచి 2000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
మిగిలిన వారు జాతీయ వైద్య కమిషన్ సూచించిన వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాష్ట్ర వైద్యమండలి రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ల సందర్భంగా నిశిత పరిశీలన ఎక్కువైనందున అక్రమ వైద్యుల గుట్టు రట్టవుతోంది. గడచిన 2 నెలల్లో రాష్ట్రంతో ముడిపడిన 5 నకిలీ సర్టిఫికెట్ల ఘటనలు ఏపీ వైద్య మండలి కార్యాలయం దృష్టికి వచ్చాయి.
డాక్టర్ అవతారమెత్తిన వాచ్మెన్ - మెడికల్ చెకప్‌లతో పాటు ఇంజక్షన్లు చేస్తూ!
నకిలీ ఎన్‌ఓసీలతో రిజిస్ట్రేషన్ యత్నం: డాక్టర్ విద్య పూర్తిచేసిన వారు వైద్య మండళ్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న తర్వాతే ప్రాక్టీసు చేయాలి. ఒకవేళ వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే ముందుగా నమోదు చేసుకున్న కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత వెళ్లాలనుకున్న రాష్ట్రంలోని మండలి కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ పొందాలి. ఈ క్రమంలోనే నకిలీ వైద్య సర్టిఫికెట్ల ఘటనలు బయటపడుతున్నాయి.
- ఏపీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఇక్కడి మండలి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నట్లు, నో అబ్జెక్షన్ తీసుకుని, కేరళలో పేరు నమోదు చేసుకోబోయిన ఓ వ్యక్తి సర్టిఫికెట్లు నకిలీవని అధికారులు గుర్తించారు.
- మరొకరు బిహార్‌లో ఎంబీబీఎస్ చదివి, ఆంధ్రప్రదేశ్‌లో తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని బిహార్‌కు వెళ్లిపోగా అక్కడ అతని బాగోతం బయటపడింది.
- అలాగే ఏపీతో ముడిపడిన మరో రెండు కేసులు హర్యానాలో బయటపడ్డాయి. వారి సర్టిఫికెట్లపై అనుమానం వచ్చి నివృత్తి కోసం ఆయా రాష్ట్రాల అధికారులు ఇక్కడికి పంపగా ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయని డాక్టర్ రమేశ్ తెలిపారు.
"ఠాగూర్ హాస్పిటల్ సీన్" రిపీట్ - కానీ, ఇక్కడ డెడ్‌బాడీ డాక్టర్‌దే