Narendra Modi lashed out at YCP: ఎన్డీఏది అభివృద్ధి మంత్రం అయితే, వైసీపీది అవినీతి తంత్రం అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇళ్లు ఇచ్చినా జగన్ నిర్మించలేదని ధ్వజమెత్తారు. .
పోలవరం ప్రాజెక్టును జగన్‌రెడ్డి తండ్రి ప్రారంభించారు, తండ్రి రాజకీయ వారసత్వాన్ని జగన్ అందుకున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్ అడ్డుకుంటున్నారని, పోలవరం కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇస్తే, ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు.
అనకాపల్లి బెల్లం, తెలుగు భాష.. రెండూ మధురమైనవే, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని, చంద్రుడి దక్షిణ భాగంపై భారత్ అడుగు పెట్టిందన్నారు. ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని మోదీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్- దేశం దశ, దిశ మార్చారు : నారా లోకేశ్ - Nara Lokesh Praises PM Modi
అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మించాం. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో ఉంది. కోల్‌కతా-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే విశాఖ మీదుగానే వెళ్తోంది. రాష్ట్ర యువత కోసం ఎన్డీఏ సర్కారు పనిచేస్తోంది. ఏపీకి ట్రిపుల్‌ఐటీ, ఐసర్, ఐఐఎం మంజూరు చేశాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేశాం. విశాఖలో పెట్రోల్ వర్సిటీ ప్రారంభించాం. ప్రధాని నరేంద్ర మోదీ
ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదన్నారు.ఎన్డీఏ మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి అయితే, వైసీపీ మంత్రం అవినీతి.. అవినీతి.. అవినీతి.. అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని, కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్- జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం: మోదీ - PM MODI speech