Nara Lokesh Shankaravam Public Meeting In Anantapur : వైఎస్సార్సీపీ నాయకులు ఉరవకొండను దోచుకుంటున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం (Shankaravam) సభలో ఆయన మాట్లాడారు. ఏ నియాజకవర్గంలో లేనంతగా పయ్యావుల కేశవ్ ఉరవకొండను అభివృద్ధి చేశారని, వైఎస్సార్సీపీ హయాంలో ప్రగతి పడకేసిందని లోకేశ్ (Nara Lokesh ) మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Payyavula Keshav In Shankaravam Uravakonda : శంఖారావం సందర్భంగా నారా లోకేశ్ ఉరవకొండ అభివృద్ది గురించి మాట్లాడారు. పయ్యావుల కేశవ్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం వచ్చాక అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కలిసికట్టుగా వైఎస్సార్సీపీను తరిమి కొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు శంఖారావం వేదికగా పిలుపునిచ్చారు.
వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే - చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం: నారా లోకేశ్
'ఉరవకొండలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. జగన్ హయాంలో కనీసం 8 ఎకరాలకు సాగునీరు ఇచ్చారా? టీడీపీ -జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తాం. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటాం. కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నాది.' -తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
'టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున తాగు, సాగునీటి పనులు జరిగాయి. ఉరవకొండలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించాం. నియోజకవర్గానికి 18 వేల ఇళ్లు సాధించారు. జగన్ వచ్చాక ఉరవకొండలో పది శాతం పనులు జరగలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉరవకొండను దోచేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారు.'- టీడీపీ నేత పయ్యావుల కేశవ
నేటి నుంచి నారా లోకేశ్ శంఖారావం - ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం
శంఖారావం సభలో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి దోపిడీలపై మండిపడ్డారు.