Nara Lokesh Praises PM Modi: నరేంద్ర మోదీ విశ్వజీత్, విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయించినవారని అర్థమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చింది మెుదలూ, ప్రపంచంలో అగ్రగామిగా భారత్‌ను నిలుపుతున్నారని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ దేశానికి మోదీ అవసరం ఎంతో ఉందని వెల్లడించారు.
దేశానికి ఏం కావాలో మోదీకి తెలుసు: దేశం దశ, దిశ, మార్చింది నమో నమో అనే 4 అక్షరాలని నారా లోకేశ్ తెలిపారు. తెలుగు పౌరుషాన్ని దేశాన్ని పరిచయం చేసింది.. ఎన్టీఆర్ అయితే, భారత్ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.. మోదీ అని పేర్కొన్నారు. దేశానికి ఏం కావాలో మోదీకి బాగా తెలుసని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో మోదీ అందిస్తున్నారని తెలిపారు. వికసిత్ భారత్ మోదీ కల, వికసిత్ ఏపీ బాబు, పవన్ కల నారా లోకేశ్ పేర్కొన్నారు.
కొత్త కంపెనీలు తేకపోగా పాత కంపెనీలను వెళ్లగొట్టారు: టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించామని లోకేశ్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో విశాఖను ఐటీ హబ్‌గా చేసినట్లు తెలిపారు. యువతకు ఉపాధి ఎలా అందించాలో బాబుకు బాగా తెలుసన్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువతే అని లోకేశ్ తెలిపారు. కొత్త కంపెనీలు తేకపోగా పాత కంపెనీలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. ఎయిమ్స్ ఆస్పత్రికి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. పొత్తు కోసం త్యాగం చేసి పవన్ తొలి అడుగు వేశారని గుర్తు చేశారు. యవగళం పేరుతో రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకోవడానికి 226 రోజులపాటు 3 వేల కి.మీ. పైగా పాదయాత్ర చేసినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. తన పాదయాత్రలో యువత కష్టాలు స్వయంగా చూశానన్నారు. అందుకే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రధాని మోదీ సహకారం ఎంతో అవసరమని, జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ అంటూ నారా లోకేశ్ తన ప్రసంగం ముగించారు.
226 రోజులపాటు 3వేల కి.మీపైగా పాద యాత్ర చేసి,ప్రజల కష్టాలను చూశాను. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాం. విశాఖను ఐటీ హబ్‌గా చేశాం. యువతకు ఉపాధి ఎలా అందించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువతే. కొత్త కంపెనీలు తేకపోగా.. పాత కంపెనీలను వెళ్లగొట్టారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో నెంబర్ వన్- జగన్ పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం: మోదీ - PM MODI speech