Nara Lokesh Praises PM Modi at Kalikiri Alliance Meeting: సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీకి తెలుసని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చెప్పారు. అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి బహిరంగ సభలో మోదీపై లోకేశ్ ప్రశంసలు కురింపించారు. ముందుగా ప్రధాని మోదీకి స్వాగతం పలికిన నారా లోకేశ్ ఆయనకు స్వామివారి ప్రతిమను బహూకరించారు. ఆ తరువాత లోకేశ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ మోదీ కల అని చెప్పారు. రక్తం పారే రాయలసీమలో తాగునీరు పారించిన ఘనత చంద్రబాబుదేనని లోకేశ్ తెలిపారు. రాయలసీమలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించినట్లు వివరించారు.
Kiran Kumar Reddy Speech: అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ప్రధాని మోదీ అని రాజంపేట పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని కొనియాడారు. జగన్ హింసా రాజకీయాలను అంతం చేసేందుకే పొత్తు పొట్టుకున్నామని ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి బహిరంగ సభలో కోరారు.
సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి మన ప్రధాని అని అన్నారు. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని తెలిపారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీకే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను వేధించేలా జగన్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. బీజేపీకి వచ్చే 370 సీట్లలో మన రాజంపేట కూడా ఉండాలని కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - YS Jagan
సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో మోదీకి తెలుసు. మోదీ పాలనలో భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం. వికసిత్ భారత్ అనేది మోదీ కల. రాయలసీమలో తాగునీరు పారించిన ఘనత కేవలం చంద్రబాబుకే దక్కుతుంది. టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమలో అనేక పరిశ్రమలు నెలకొల్పాము. కరవు జిల్లా అనంతపురం జిల్లా యువతకు ఉపాధి కల్పించాము.- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి మోదీ. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీకే దక్కుతుంది. రాష్ట్రంలో ప్రజలను వేధించేలా జగన్ పాలన ఉంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. బీజేపీకు వచ్చే 370 సీట్లలో రాజంపేట కూడా ఉండాలి.- కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి