Nara Brahmani Visit A Small Hotel: గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలోని ఓ చిన్న హోటల్‌కు అనుకోని అతిథిగా ఆమె వెళ్లడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని మార్గమధ్యలో ఓ చిన్న హోటల్‌ను నారా బ్రాహ్మణి సందర్శించి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. పేదవాళ్ల కష్టాలను తెలుసుకునేందుకు నారా బ్రహ్మణి ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబసభ్యుల కోసం జిలేబి, లడ్డూలను ఆమె కొనుగోలు చేశారు. హోటల్‌కు బ్రాహ్మణి వచ్చారన్న సమాచారం తెలియడంతో ఆమెను చూసేందుకు గ్రామస్థులు అక్కడికి చేరుకుని జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. తనకు పెదవడ్లపూడి జిలేబీ అంటే ఇష్టమని బ్రాహ్మణి చెప్పగా అక్కడ ఉన్నవారితో బ్రహ్మణి కాసేపు ముచ్చటించారు.
హిందుపురంలో బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం - భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన
ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని పసుపు తయారీ పరిశ్రమలు మహిళా కూలీలతో నారా బ్రాహ్మణి మాటా మంతి నిర్వహించారు. పసుపు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్త్రీ శక్తి పథకం లబ్దిదారులతో బ్రాహ్మణి సమావేశం అయ్యారు. మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఆమె చెప్పారు. టీడీపీ ఏర్పాటు తర్వాత ఆస్తులలో మహిళలకు సమాన వాటా, ప్రత్యేక విశ్వవిద్యాలయంతో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలోను మహిళలకు ఉపయోగపడే పథకాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణం తదితర పథకాలను మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారని బ్రాహ్మణి చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేశ్ 29 సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అదే అధికారంలో ఉంటే మరిన్ని కార్యక్రమాలకు చేస్తారన్నారు.
మహిళలకు సహాయం చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ వెనుకాడరు: బ్రాహ్మణి - Brahmani Meet womens in Mangalagiri
మంగళగిరిలో విస్తృతంగా పర్యటించిన బ్రహ్మణి మామిడికాయ పచ్చడి తయారు చేసే మహిళా కార్మికులతో సమావేశమయ్యారు. మహిళలతో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. నారా లోకేష్ మహిళలకి అధిక ప్రాధాన్యమిస్తారని అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తారని బ్రాహ్మణి హామీ ఇచ్చారు.
మంగళగిరి మెయిన్ బజార్లో చెరుకు రసం తాగారు. రోజుకి ఎంత ఆదాయం వస్తుందంటూ చెరుకు రసం తయారు చేసే మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వర్ణాభరణాలు తయారు చేసే వ్యాపారులతో సమావేశం అయ్యారు. వ్యాపారంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెవి దుద్దులను కొనుగోలు చేశారు. వస్త్ర వ్యాపారులతో సమావేశమైన బ్రాహ్మణి గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఐదు సంవత్సరాలుగా అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వ్యాపారులు బ్రాహ్మణ దృష్టికి తీసుకువచ్చారు. ఇంకొక నెల రోజులు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. తనకు నచ్చిన పసుపు రంగు చీరలను బ్రాహ్మణి వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు.