Nara Bhuvaneswari Thanks to CM Chandrababu for Buy Sarees : నేతన్నల జీవనోపాధికి మద్దతునిస్తూ, మన సాంప్రదాయ వస్త్రాల అద్భుత వైవిధ్యాన్ని చాటేందుకు, చేనేత వస్త్రాలు ధరించేందుకు ఎంతో ఇష్టపడతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. తన కోసం రెండు చేనేత చీరలు కొనుగోలు చేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కొనుగోలు చేసిన చేనేత చీరలపై భువనేశ్వరి ఎక్స్(X) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే చంద్రబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేశారు
This would be an excellent step. Handloom weaving is not only a source of rural livelihood, but also a sustainable and ethical heritage craft. When we choose to wear handloom clothing, we choose to support livelihoods and embrace the beautiful diversity of our traditional… https://t.co/maCNz2PDty
— Nara Bhuvaneswari (@ManagingTrustee) August 8, 2024
Chandrababu Bought Saree For Nara Bhuvaneswari : నేతన్నల చీర నేయడం అనేది గ్రామీణ జీవనోపాధికి మూలంతో పాటు సంప్రదాయ వారసత్వ కళ అని నారా భువనేశ్వరి గుర్తు చేశారు. దీనిని ఓ అద్భుతమైన ప్రక్రియగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అమూల్యమైన చేనేత రంగాన్ని పునరుద్ధరించి, దానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
భువనేశ్వరికి గుండెనొప్పి వచ్చేలా చంద్రబాబు చేసిన పని ఏంటీ?
మొదటిసారి కొనుగోలు చీరపై భువనేశ్వరి స్పందన వైరల్ : నారా భువనేశ్వరి ఎన్నికలకు ముందు 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. గతంలో చంద్రబాబు చేసిన పనితో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయిందంటూ, భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి. ఇంతకీ అవి ఏంటీ అనేదేగా మీ సందేహం.
వివరాల్లోకి వెళ్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగిందని భువనేశ్వరి వెల్లడించారు. 'చాలా మంది భర్తలు వారి భార్యకు విలువైన వస్తువులు తీసుకొస్తారు, మీరు మాత్రం ఏం తీసుకొనిరారు.. ఎందుకు' అని చంద్రబాబును అడిగానని, ఆ మాటలను గుర్తు పెట్టుకొని మరీ ఓ రోజు చంద్రబాబు చీర తీసుకొని వచ్చారని తెలిపారు. అయితే దానిని చూడగానే తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందన్నారు. ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉంది' అంటూ నవ్వులు పూయించారు. అయినా సరే తన భర్త తీసుకొని వచ్చిన చీరను జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నట్లు భువనేశ్వరి తెలిపారు. తన భర్తకు ఎప్పుడూ ప్రజాసేవ ధ్యాసే తప్పా, కుటుంబం గురించి ఆలోచన తక్కువ అనేది తన ఉద్దేశ్యమని భువనేశ్వరి పేర్కొన్నారు.
భువనేశ్వరి కోసం రెండు చీరలు కొన్న చంద్రబాబు - CBN in Handloom Day Celebrations