Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో కలత చెంది ఆగిన గుండెల కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటుగా, ఆయా కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా, నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది.
మూడు లక్షల ఆర్థిక సాయం: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమం కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం, తుని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నారా భువనేశ్వరికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మూడు రోజుల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను నారా భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మృతి చెందిన జగ్గంపేట గుర్రపాలెంకు చెందిన వీరబాబు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన ముద్దాల సుబ్బారావు కుటుంబాన్ని, పరామర్శించారు. వారికి తాము ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎలాంటి కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అడగా ఉంటుందని భువనేశ్వరి భరోసా కలిపించారు. తుని మండలం ఎర్రకోనేరులో ఇస్రాపు నూకరాజు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
Reaction Other Party Leaders on Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ మంజూరుపై పవన్, పురందేశ్వరి హర్షం
అక్టోబర్‌లో ప్రారంభమైన నిజం గెలవాలి యాత్ర: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో గతేడాది అక్టోబర్‌లో చంద్రగిరి నియోజకవర్గం యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు బెయిల్ పై విడుదలయిన అనంతరం నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్లీ 'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేస్తూ, వారి తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు.
భువనేశ్వరి పర్యటన వివరాలు: మూడు రోజుల పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి నేడు తుని, కాకినాడ నియోజకవర్గాల్లోనూ ఆమె పర్యటించనున్నారు. గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేటలో పర్యటన సాగనుంది. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన