Nara Bhuvaneswari Nijam Gelavali Yatra : స్కిల్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో కలత చెంది ఆగిన గుండెల కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటుగా, ఆయా కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మెగా హెల్త్ క్యాంప్ - చిన్నారులకు బహుమతులు పంచిన నారా బ్రహ్మణి
కష్టం వస్తే టీడీపీ అండగా ఉంటుంది: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తల్లడిల్లిపోయి మరణించిన తురిమెళ్ళ పరిశుద్దరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి, వారి కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె చెప్పారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం మూడు లక్షల రూపాయల చెక్కును భువనేశ్వరి అందజేశారు. ముండ్లమూరు మండలం సింగన్నపాలెంలో హనుమంతరావు కుటుంబానికి 3 లక్షల చెక్కును అందజేశారు. తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలోని తేజ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ప్రసన్నలక్ష్మికి కూడా 3 లక్షల చెక్కును ఇచ్చారు. భువనేశ్వరిని చూసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, నారశెట్టి పాపారావు, గోరంట్ల రవికుమార్, సంతనూతలపాడు ఇంన్ఛార్జీ బీఎన్ విజయ్ కుమార్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది: 'నిజం గెలవాలి' యాత్రలో నారా భువనేశ్వరి
చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి గత కొన్ని రోజులుగా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు భువనేశ్వరి బాసటగా నిలిచారు. ప్రతి వారం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో దాదాపు 200 మంది చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించటంతో ఆ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.
విశాఖలో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా
అక్టోబర్‌లో ప్రారంభమైన నిజం గెలవాలి యాత్ర : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో గతేడాది అక్టోబర్‌లో చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలయిన అనంతరం నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్లీ 'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేస్తూ, వారి తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు.