Nara Bhuvaneswari Election Campaign in Chitoor District : చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు శాంతిపురం మండలంలో పర్యటించారు. మండలంలోని పలుగ్రామాల్లో పర్యటించి వైఎస్సార్సీపీ పాలనను ఎండగట్టారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నిజం గెలవాలి యాత్ర తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నా: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari Interview
నారా చంద్రబాబునాయుడి కుటుంబం ఆఖరి శ్వాస వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతిపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు. కర్ణాటక సరిహద్దులో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు చంద్ర బాబు కుటుంబం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబును ఆశీర్వదిస్తూ ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు కుప్పం అభివృద్ధి కోసం ఆయనకు లక్ష ఓట్ల అధిక్యతను అందించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ శ్రేణులు సైకిల్ వేగాన్ని మరింతగా పెంచాలని కోరారు. అడ్డచ్చే దుర్మార్గులను తొక్కుకొంటూ విజయ తీరాల వైపు సాగాలని ఓటర్లుకు పిలుపునిచ్చారు.
13న ముగియనున్న 'నిజం గెలవాలి' యాత్ర - సభకు చురుగ్గా ఏర్పాట్లు - BHUVANESWARI NIJAM GELAVALI YATRA
ప్రజల భూములను లాక్కొవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రజలు అన్ని విధాల నష్టపోయారని పేర్కొంది. అధికార ప్రభుత్వం అయిదేళ్ల పరిపాలనలో అవినీతి, అక్రమాలు, అరాచలకు అడ్డగా మారిందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లుకు పిలుపునిచ్చారు.