Bhuvaneshwari Nijam Gelavali Yatra in Eluru District : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర ఆందోళనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిజం గెలవాలి కార్యక్రమంతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వారికి ధైర్యాన్నిస్తూ భరోసా కల్పిస్తున్నారు. అధైర్యపడొద్దని, బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. వారికి ఆర్థిక సాయంగా మూడు లక్షల రూపాయలను అందిస్తున్నారు.
రేపటి నుంచి నిజం గెలవాలి మలి విడత యాత్ర - నాలుగు రోజులపాటు భువనేశ్వరి పర్యటన - Nijam Gelavali Yatra
nara Bhuvaneshwari visit joint West Godavari district : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచకాల కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూడలేకే రోడ్డుపైకి వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా రెండోరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టీ.నరసాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లో పర్యటించారు. టీ.నరసాపురం మండలం మక్కినవారిగుడెంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను పలకరించి వారికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన మహిళలతో భువనేశ్వరి సమావేశమయ్యారు. ప్రజల కష్టాలు తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ పుడితే, ప్రజలను హింసించడం కోసం వైఎస్సార్సీపీ పుట్టిందని భువనేశ్వరి ఆరోపించారు. రాష్ట్రాన్ని గంజాయి వనంలా తయారుచేసి ప్రజల మాన, ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సీర్సీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హుందాగా ఉండే ఏపీ రాజకీయం రౌడీ రాజ్యమైంది : నారా భువనేశ్వరి - Bhuvaneswari Nijam Gelavali Yatra
నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి పలు జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న విషయం విదితమే. తెలుగుదేశం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే చంద్రబాబు అమలు చేస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. 'నిజం గెలవాలి' నినాదంతో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
'రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలంతా చేయిచేయి కలిపి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి' - Bhuvaneshwari Nijam Gelavali Yatra