ETV Bharat / state

వైసీపీకి షాక్​ - కాంగ్రెస్​లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్

Nandikotkur YSRCP MLA Arthur Joined Congress: ప్రజల్లో తీవ్ర వ్యతరేకతను మూటగట్టుకున్న వైసీపీని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడగా తాజాగా ఆ లిస్టులో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ సైతం చేరారు. నేడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

Nandikotkur_YSRCP_MLA_Arthur_Joined_Congress

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 4:27 PM IST

Nandikotkur YSRCP MLA Arthur Joined Congress : వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు ఆపాదిస్తూ వారిని సీఎం జగన్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ అధిష్ఠానం తీరును విమర్శిస్తూ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. అంతే కాకుండా మరికొంత మంది వైసీపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు.

తాజాగా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార పార్టీని వీడి కాంగ్రెస్​లోకి మారారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవటంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు.

వైఎస్సార్సీపీలో మరో వికెట్​ - పార్టీకి ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్​ బై

విసిగిపోయిన ఎమ్మెల్యే ఆర్ధర్: వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్నెళ్లకే రాజీనామా చేసి వెళ్లిపోదామనే స్థాయిలో ఆర్ధర్ విసిగిపోయారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో ఎమ్మెల్యే పలుమార్లు ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి ప్రారంభ కార్యక్రమాలకి సైతం బైరెడ్డి ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి.

ఆర్థర్‌, బైరెడ్డి మధ్య విభేదాలు: ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నా, బైరెడ్డి ఆధిపత్యమే కొనసాగుతుండటంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకానొక సందర్భంగా ఆర్ధర్ ఆలయానికి వచ్చిన సమయంలో కూడా మాటామాటా పెరిగి, బాహాబాహీకి దిగారు. దీనిపై వైసీపీ అధిష్ఠానం సైతం పట్టించుకోకపోవడంతో, ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆర్ధర్​కి సీటు ఇవ్వకుండా వేరే వ్యక్తికి వైసీపీ సీటు ఇచ్చింది. ఇలా అనేక సార్లు తగ్గుతూ వచ్చిన ఆర్ధర్, ఇక నా వల్ల కాదంటూ నేడు వైసీపీని వీడి కాంగ్రెస్​లోకి చేరారు.

'నేను నా అవినాష్' - ఎవరేమనుకుంటే నాకేంటి, నా తమ్ముడికే టికెట్

తాజాగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు: పార్టీలో అనిశ్చితి ఏర్పడిందని, వాటికి నేను బాధ్యుడిని కాదని, ఆ గందరగోళానికి తెరదించేందుకే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కొద్ది రోజుల క్రితం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) ప్రకటించారు. వైసీపీలోని పరిస్థితులకూ ఎంపీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. జగన్‌తో కంటే జనంతో ఉండడమే మంచిదని భావిస్తూ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీను వీడుతున్నారు. లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు సంజీవ్ కుమార్, వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni), రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ఇలా పలువురు ఎంపీలు కూడా వీడారు.

టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి - చంద్రబాబుతో వర్మ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.