Nandamuri Balakrishna Swarnandhra Sakara Yatra in Gudluru : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత, ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. జిల్లాలోని గుడ్లూరు మండలంలో 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీకు వెలుగు కావాలా? చీకటికావాలా?. స్వర్ణయుగం కావాలా? రాతి యుగం కావాలా?. ఓటుకు వెలకట్టవద్దు అంటూ బాలకృష్ణ ప్రసంగానికి అభిమానులు ఉర్రూతలూగారు. సభకి టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. సభలో బాలకృష్ణ ప్రసంగానికి అభిమానులు, కార్యకర్తలు ఈలలతో,కేకలతో ప్రోత్సహించారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బాలకృష్ణ - వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు
జిల్లాలోని గుడ్లూరులో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఈరోజు సీనీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ ఎన్నికల రణరంగంలో అందరం కలిసి పోరాటంచేయాలి. జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలి అని పిలుపునిచ్చారు. నందమూరి తారకరామారావు ఒక చరిత్ర అని. చేనేత కార్మికుల వృత్తిని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ఖాదీ వస్త్రాలు దరించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
NBK Rally IN Nellore District : రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చారని. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగుదేశం పార్టీనే అన్నారు. పార్టీ కోసం ప్రాణలు సైతం ఇచ్చే కార్యకర్తలు ఉన్న ఎకైక పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. చంద్రబాబునాయుడు అదే అభివృద్ధిని కొనసాగించారని తెలిపారు. ఐటీరంగం అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. కానీ, ఈరోజు వైసీపీ సిద్దం హోర్డింగ్ లతో రాష్ట్రన్ని నింపారని విమర్శించారు. అభివృద్ధి అంటే హోర్డింగ్లు పెట్టుకోవడమా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం : నందమూరి బాలకృష్ణ
రాష్ట్రంలోని ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని మాట్లాడుతున్న జగన్ వారిని అభివృద్ధి చేయలేదు. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేశాడు. నిత్యవసర ధరలు పెంచాడు. ఆస్తిమీద పన్ను, చెత్తమీద పన్ను వేశాడు. వీటిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. చివరికి అన్యాయాన్ని టీడీపీ నేతలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాడు. బీసీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేశాడని బాలకృష్ణ మండిపడ్డారు.
2047 విజన్ తో చంద్రబాబు మీ ముందుకు వచ్చాడు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తాం. ఒక్కసారి అవకాశం అని చెప్పి మళ్లీ అధికారంలోకి రావడానికి కోడికత్తి, గొడ్డలి, గులకరాయి ప్రయోగం చేశాడు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. ఏ2 విజయసాయిరెడ్డి విశాఖలో తవ్వి తవ్వి నెల్లూరుకు వచ్చి పడ్డాడని విమర్శించారు. ఇక్కడ కూటమిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. వెలుగు కావాలా చీకటి కావాలా అనేది మీరు ఆలోచించుకోండి మన రాష్ట్ర భవిత్యత్ను మనమే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఓటును వెలకట్టవద్దు, కుదవపెట్టవద్దు. స్వప్రయోజనానికి దుర్వినియోగం చేయవద్దు. రానున్న ఎన్నికల్లో మన ఉనికిని కాపాడుకుందాం చాటుకుందామని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
సీఎం జగన్ దళిత ద్రోహి - సమసమాజ స్థాపనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది: బాలకృష్ణ