ETV Bharat / state

బాలయ్య మంచి మనసు - తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం - BALAKRISHNA DONATES 50 LAKHS TO TG

Balakrishna Donation To Flood Victims : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ భారీ విరాళం అందించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. తన బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు తెలిపారు.

Balakrishna
Balakrishna (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 4:09 PM IST

Updated : Sep 3, 2024, 4:41 PM IST

Balakrishna Donates Rs.1 Crore To Telugu States Flood Victims : తన అభిమానులకు ఏం జరిగినా ఎప్పుడూ అందుబాటులో ఉండి సాయం చేస్తుంటారు నందమూరి బాలకృష్ణ. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందరికంటే ముందు ప్రజల కోసం కదిలొస్తారు. కేవలం నటుడిగానే కాదు ఎమ్మెల్యేగా కూడా ఆయన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలుగు ప్రజల కోసం బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు.

Balakrishna Donation : "తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు చాలా మందిని బలి తీసుకున్నాయి. అలాగే ఎంతో మందిని నిస్సహాయుల్ని చేశాయి. చాలా మంది ఈ వరదల్లో సర్వం కోల్పోయారు. మీ అందరికి ఈ కష్టసమయంలో ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల్లో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. నా బాధ్యతగా బాధితుల కోసం విరాళం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నాను." అంటూ బాలకృష్ణ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు - ఎన్టీఆర్​ సహా ఎవరెవరు ఎంత ఇచ్చారంటే? - NTR Donate 1 Crore to Telugu States

బాలకృష్ణ ప్రకటన పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సాయపడటంతో ఆయనెప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. అభిమానుల కోసం, తెలుగు ప్రజల కోసం ముందుకు రావడంలో నందమూరి వారసులకు ఎవరూ సాటిలేరంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. బాబాయ్, అబ్బాయిలకు తెలుగు ప్రజల కృతజ్ఞలు అంటూ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు.

Telugu Film Industry Donations To Flood Victims : అలాగే యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన వంతు విరాళాన్ని ప్రకటించారు. ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో 5 లక్షల రూపాయల చొప్పున 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి (తెలంగాణ రూ.50 లక్షలు+ఏపీ రూ.50 లక్షలు), యంగ్ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షలు ప్రకటించారు. విశ్వక్ సేన్ రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీల విరాళం రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం అందజేస్తున్నట్లు చెప్పారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ రూ.25 లక్షలు విరాళం అందించారు.

వరద కష్టాలపై స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - NTR Donate 1 Crore to Telugu States

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Last Updated : Sep 3, 2024, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.